For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పిచ్చెక్కిపోతున్నారు: ఆమె వీపుమీద పచ్చబొట్టులో ఏముందీ??

  |

  కొద్ది నెలల కిందటే పన్నెండేళ్ల ప్రేమ బంధానికి, రెండున్నరేళ్ల వైవాహిక బంధానికి హాలీవుడ్ స్టార్ జంట ఏంజెలీనా జోలీ, ఆస్కార్ ఆవార్డు విజేత బ్రాడ్ పిట్ స్వస్తి చెబుతున్నారన్న వార్త ప్రపంచ వ్యాప్తంగా వారిద్దరి అభిమానులకి షాక్ లా తగిలింది.. 2004 నుంచి ప్రేమ బంధంతో కలిసి జీవించిన వీరిద్దరూ 2014లో వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఆరుగురు పిల్లలు. ముగ్గురు పిల్లల్ని దత్తత తీసుకోగా, ముగ్గురు పిల్లలు వీరి దాంపత్యానికి చిహ్నంగా పుట్టారు. ఎన్నో ఆటుపోట్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జంట హాలీవుడ్ లో 'మోస్ట్ అడోరబుల్ కపుల్'గా పేరుతెచ్చుకుంది.

  ఏంజెలినా జోలీ, బ్రాడ్‌ పిట్‌

  ఏంజెలినా జోలీ, బ్రాడ్‌ పిట్‌

  పాశ్చాత్య దేశాల్లో పెళ్లిల్లు, విడాకులు సాధారణమే. పైగా రంగుల ప్రపంచమైన హాలీవుడ్‌లో మరింత సాధారణం. అయితే పన్నెండేళ్లకు పైగా బంధం, అరడజను మందికి పైగా పిల్లలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు.. ఇలా హాలీవుడ్‌లోనే అత్యంత ఆదర్శవంతమైన జంటగా నిలిచారు ఏంజెలినా జోలీ, బ్రాడ్‌ పిట్‌ దంపతులు. అయితే ఉన్నట్టుండీ ఏంజెలినా తన భర్త బ్రాడ్‌పిట్‌తో విడిపోవాలని నిర్ణయించుకుంది. కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు కూడా చేసుకుంది.

  వార్తలకీ, కెమెరాలకీ దూరమైపోయింది

  వార్తలకీ, కెమెరాలకీ దూరమైపోయింది

  ఆతర్వాత చాలా కాలం పాటు ఆమె వార్తలకీ, కెమెరాలకీ దూరమైపోయింది. గత మార్చిలో తన పిల్లలతో కలిసి బయటకు వచ్చిన జోలీ దాదాపు ఎముకల గూడులా మారిపోయింది. ఈ పరిస్థితి నుంచి జోలీ బయటపడడం కష్టమేనని సన్నిహితులు భావించారు. అయితే ఆతర్వాత ఏంజిలినా మ‌న‌సు మార్చుకున్న‌ది. త‌న భ‌ర్త బ్రాడ్ పిట్‌కు ఇచ్చిన విడాకుల నోటీసును ఆమె వెన‌క్కి తీసుకోవాల‌నుకుంది. ఆ తర్వాత ఆమె పూరి ఆరోగ్యంతో మళ్ళీ బయటకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇద్దరూ ఒక్కటైపోయినట్టే

  ఫస్ట్ దే కిల్డ్ మై ఫాదర్

  ఫస్ట్ దే కిల్డ్ మై ఫాదర్

  విడాకుల వ్యవహారం కూడా కొలిక్కి వచ్చిన తర్వాత ఇప్పుడు సడెన్ గా ప్రత్యక్షమైపోయింది ఏంజెలీనా. ఇంతకూ అమ్మడు ఇలా బైట కనిపించిన కారణం ఏంటంటే.. ఈ సొగసరి తొలిసారి దర్శకత్వం చేసిన సినిమా ప్రీమియర్ ప్రదర్శన. ఫస్ట్ దే కిల్డ్ మై ఫాదర్ చిత్రాన్ని.. ఈ గురువారం నాడు న్యూయార్క్ సిటీలో ప్రదర్శించారు.

  బ్యాక్ లెస్ అందాలు

  బ్యాక్ లెస్ అందాలు

  ఈ కార్యక్రమం కోసమే ఏంజెలీనా బయటకు వచ్చింది. ఇలా తన బ్యాక్ లెస్ అందాలను ఆరబోసేసేసింది. అది కూడా తన కొత్త ట్యాటూను వయ్యారంగా ప్రదర్శించడానికే అనే సంగతి ఫోటో చూస్తే అర్ధమైపోతుంది. టూంబ్ రైడర్ బ్యూటీకి.. ఇలాంటి పజిల్స్ తరహా మ్యాప్స్ బాగా నచ్చేసినట్లున్నాయి. అందుకే దాదాపు టూంబ్ రైడర్ మ్యాప్ లాంటిదే ఓ పెద్ద ట్యాటూను వీపంతా పరుచుకునేలా వేయించుకుంది.

  స్ట్రాప్ లెస్ గౌను

  స్ట్రాప్ లెస్ గౌను

  అసలే అమ్మడు ధరించిన గౌను స్ట్రాప్ లెస్ కూడా కావడంతో.. అందాలన్నీ తెగ దర్శనం ఇచ్చేస్తున్నాయి. ఇక ఈ ప్రీమియర్ కి ఏంజెలీనా జోలీ తన తండ్రి జాన్ వాయిట్ తో కలిసి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆరేళ్లుగా వీరిద్దరి మధ్య సత్సంబంధాలు లేవు. కానీ ఫస్ట్ దే కిల్డ్ మై ఫాదర్ మూవీలో సెంటిమెంట్ ఈ తండ్రీ కూతుళ్లను కలిపినట్లుగా ఉంది.

  English summary
  The large inking is a tribute to her estranged husband Brad Pitt which she got while on a break from filming First They Killed My Father
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X