»   » భూకంప పీడిత 'హైతీ'ని దర్శించి తన ఔదార్యాన్ని చాటిన తార..!!

భూకంప పీడిత 'హైతీ'ని దర్శించి తన ఔదార్యాన్ని చాటిన తార..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ హాలీవుడ్ తార ఏంజలీనా జోలీ భూకంపంతో అతలాకుతలం అయిన హైతీ దేశాన్ని సందర్శించారు. ఐక్యరాజ్యసమితి గుడ్ విల్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఆమె ఇటీవలే హైతీ దేశ రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్ పరిసరాల్లోని నిరాశ్రయులను పరామర్శించారు. అక్కడ వారి రక్షణకై తీసుకుంటున్న చర్యలు, పిల్లల పోషనకై ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆమెతో కూడా ఐక్యరాజ్యసమితి అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

ఈ పర్యటనలో ఆమె ఇతర దేశాల నుండీ హైతీకి వచ్చి ఉచితంగా సేవలు అందిస్తోన్న డాక్టర్లను కలుసుకొని వారిని అభినందించారు. అక్కడి డాక్టర్ల సేవలకు ఉడుతాభక్తి సాయంగా ఆమె మిలియన్ డాలర్లను విరాళంగా అందజేసి తన ఔదార్యాన్ని మరోసారి చాటిచెప్పింది. కాగా జోలీ ఐక్యరాజ్యసమితి గుడ్ విల్ అంబాసిడర్ ఇంతకు ముందు ఇరాక్, థాయ్ ల్యాండ్, పాకిస్తాన్ లాంటి దేశాలను సందర్శించారు. ఎంతో బిజీగా వుంటూ కూడా ఆమె చేస్తున్న సేవలకు అందరూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu