For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వివాదంలో యాక్షన్ స్టార్ జాకీచాన్‌..ఫోటో దుమారం

  By Srikanya
  |

  బీజింగ్‌ : ప్రఖ్యాత నటుడు జాకీచాన్‌కు సంబంధించిన ఓ ఫొటో చైనాలో వివాదం రేపుతోంది. జాకీ ఇద్దరమ్మాయిలతో కలిసి కారులోకి వెళుతుండగా దిగిన ఫొటో అది. అంతవరకయితే వివాదం ఏదీలేదుగానీ.. ఆ కారుపై సైన్యానికి సంబంధించిన లైసెన్స్‌ ప్లేట్‌ ఉండడమే సమస్య. రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఫలకాలు, చిహ్నాలున్న కార్లు ఇతరులెవరూ ఉపయోగించకూడదన్నది ఆ దేశ నియమం. ఆ రూల్ అతిక్రమించాడని జాకీ చాన్ పై అభియోగం.

  ఆ మిలిట్రీ కార్లలో వెళితే సహజంగానే చైనాలో రోడ్డు సుంకాలు, ఇతర రుసుములేవీ వసూలుచేయరు. ఆ రాయితీలు పొందేందుకోసమే మిలటరీ చిహ్నాలు, లైసెన్స్‌ ప్లేట్‌లు ప్రయివేటు కార్లకూ వాడుతున్నారనే ఆరోపణలున్నాయి. కొందరు సైనికాధికారులూ ఇందుకు మినహాయింపు కాదు. చైనా సూక్ష్మ సందేశ వేదిక 'వీబో'(ట్విటర్‌ లాంటిది)లో కొందరు ఇటువంటి సైనికాధికారుల ఫొటోలూ బట్టబయలయ్యాయి.

  చైనా కాబోయే అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ అధికారులు ఇలాంటి పనులు చేయకూడదని సున్నితంగా మందలించారు కూడా. ఈ నేపథ్యంలోనే 2010 నాటి జాకీ చాన్‌ కారు ఫొటో వీబోలో తాజాగా ప్రత్యక్షమయింది. సైన్యానికి సంబంధించిన లైసెన్స్‌ ప్లేట్స్‌ ఇలా దుర్వినియోగం అవుతున్నాయంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 'జాకీచాన్‌ను మన సైన్యానికి స్టంట్స్‌ నేర్పడానికి నియమించారేమో..' అంటూ వ్యంగ్యవ్యాఖ్యలు విసురుతున్నారు. దీనిపై చైనా రక్షణ శాఖ స్పందించింది. ఫలకాలు దుర్వినియోగం కానీ రీతిలో ఇకపై సరికొత్తవి తయారుచేస్తామంటూ ప్రకటించింది.

  ఎన్నో కష్టనష్టాలతో సినీ ప్రస్థానం ఆరంభించిన జాకీచాన్‌ ఆ తరువాత అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. ఆక్రోబాటిక్‌ ఫైటింగ్‌ స్టయిల్‌, సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌కు, వినూత్న స్టంట్స్‌కు మారుపేరు జాకీచాన్‌,ఆయన పేరు చెబితే చాలు మార్షల్‌ ఆర్ట్స్ అభిమానులు పులకరించిపోతారు. 1960 నుంచి నటనారంగంలో ఉన్న జాకీచాన్‌ ఇటీవలే తన 100వ చిత్రాన్ని పూర్తి చేసుకున్నారు. గాయకుడు కూడా అయిన జాకీచాన్‌ ఎన్నో ఆల్బమ్స్‌ కూడా విడుదల చేశారు. తాను నటించిన చిత్రాల్లోనూ ఎన్నో థీమ్‌ సాంగ్స్‌ పాడారు.

  ఎనిమిదేళ్ళ వయస్సులోనే జాకీచాన్‌ 'బిగ్‌ అండ్‌ లిటిల్‌ వాంగ్‌ టిన్‌ బార్‌' (1962)లో నటించాడు. అలా ఆయన సినిమా కేరీర్‌ ప్రారంభమైంది. 17 ఏళ్ళవయస్సులో బ్రూస్‌లీ సినిమాల్లో స్టంట్‌మాన్‌గా నటించాడు. ఆ తరువాత 'లిటిల్‌ టైగర్‌ కాంటన్‌' లో ప్రముఖ పాత్ర లభించింది. 1973లో అది హాంకాంగ్‌ ప్రాంతంలో మాత్రమే విడుదలైంది. మొదట్లో నటించిన సినిమాలు ఫెయిల్‌ కావడం, స్టంట్‌ పనులు దొరకడం కష్టం కావడంతో 1975లో జాకీచాన్‌ పెద్దలకు మాత్రమే అనదగ్గ 'ఆల్‌ ఇన్‌ ది ఫ్యామిలీ' సినిమాలో నటించాడు. జాకీచాన్‌ నటించిన వాటిల్లో ఒక్క ఫైట్‌ లేదా స్టంట్‌ సీన్‌ లేని చిత్రం అదొక్కటే కావడం విశేషం.

  English summary
  Jackie Chan has once again found himself the center of controversy after photos of him stepping into a car with military license plates in Beijing were posted on Sina Weibo on Friday. The photos were exposed at a time when the abuse of military vehicles and their privileges has increasingly come under fire, the South China Morning Post reports. “Has our military hired Jackie Chan to teach soldiers martial arts?”, said Yu Jianrong, an avid online activist and researcher at the Chinese Academy of Social Sciences.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X