»   » మొన్న శృంగారం ఒలకబోసిన హీరోయిన్‌ కి క్యాట్ ఉమెన్‌గా అవకాశం

మొన్న శృంగారం ఒలకబోసిన హీరోయిన్‌ కి క్యాట్ ఉమెన్‌గా అవకాశం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్‌లో తీసినటువంటి బ్యాట్ మ్యాన్ సినిమా తెలుగులోకి అనువదింపబడి కూడా మంచి వసూళ్శను రాబట్టింది. అలాంటి బ్యాట్ మ్యాన్ సినిమాకి కోనసాగింపుగా మరో సినిమాని నిర్మించడానికి డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ప్రయత్నాలు చేస్తున్నారు. మూడవ సారి తీస్తున్నటువంటి ఈసినిమాకి పేరు ది డార్క్ నైట్ రైజెస్‌గా నామకరణం చేయడం జరిగింది. ఈ మూడవసారి దర్శకత్వం వహిస్తున్న బ్యాట్ మ్యాన్ సిరిస్ సినిమాలో కధానాయికగా నటాలీ పోర్ట్ మెన్, కైరా నైట్లీ, రేచల్, నోమి వాట్స్, బ్లేక్ లైవిలీ లాంటి మహా మహాలాంటి స్టార్ హీరోయిన్లును కాదని అన్నే హాత్వేని హీరోయిన్‌గా తీసుకున్నారు.

ఈసందర్బంలో 1992లో వచ్చినటువంటి బ్యాట్ మ్యాన్ మొట్టమొదటి సినిమా బ్యాట్ మెన్ రిటర్న్స్ లో హీరోయిన్‌గా మిచెల్లీ ప్రిపేర్ నటించడం జరిగింది. ఇక 2004లో వచ్చినటువంటి రెండవ బ్యాట్ మ్యాన్ సినిమాలో హాలీ బెర్రి హీరోయిన్‌గా నటించడం జరిగింది. బ్యాట్ మ్యాన్ మూడవ సినిమా అయినటువంటి ది డార్క్ నైట్ రైజెస్‌‌ని వార్నర్ బ్రదర్స్ నిర్మాతలుగా వ్యవహారిస్తున్న విషయం తెలిసిందే. ఈసందర్బంగా ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ కాన్పరెన్స్‌లో డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ మాట్లాడుతూ అన్నే హాత్వేతో కలసి పనిచేయడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. తనతో పనిచేసినటువంటి చాలామంది దర్శకులు తనతో పనిచేయడం చాలా సరదాగా మాత్రమే కాకుండా ఈజ్‌గా ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే.

అన్నే హాత్వే తోపాటు ఈసినిమాలో బ్రిటిష్ యాక్టర్ టామ్ హార్టీ బ్యాట్‌ని పగలగొట్టే మనిషిగా నటించనున్నారు. ఇక లీడ్ రోల్స్ విషయానికి వస్తే బ్యాట్ మ్యాన్‌గా క్రిస్టియన్ బేల్ చేస్తున్నారు. ఇతని సరసన హీరోయిన్‌గా సెలీనా కేల్ అనే పాత్రలో అన్నే హాత్వే నటిస్తున్నారు. ఈసినిమాని జులై 20, 2012కల్లా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తన ఇంటర్యూలో తెలిపారు. ఇటీవల విడుదలైన తన కొత్త సినిమా లవ్ అండ్ అదర్ డ్రగ్స్ లో అన్నే హాత్వే శృంగారం ఎక్కవగా ఒలకబోసిన విషయం తెలిసిందే. లవ్ అండ్ అదర్ డ్రగ్స్ లోని హీరో జాక్ జిల్హానల్‌తో అన్నే హాత్వే రెచ్చిపోయిమరీ నటించడం జరిగింది.

English summary
Anne Hathaway will play Catwoman in the new Batman film, ''The Dark Knight Rises''. Director Christopher Nolan has cast the actress as Selina Kyle- the feline superhero''s alter-ego- in his third and final installment of the franchise. Hathaway is said to have won the role over Natalie Portman, Keira Knightley, Rachel Weisz, Naomi Watts and Blake Lively.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu