twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమాల్లో హింస తప్పేమీ కాదని యాక్షన్ హీరో వ్యాఖ్యలు

    By Srikanya
    |

    న్యూయార్క్‌ : సినిమాలలో హింస ను చూపించటం వల్లతప్పేమీ లేదని కాలిఫోర్నియా మాజీ గవర్నర్‌, హాలీవుడ్‌ నటుడు అర్నాల్డ్‌ ష్వాన్‌ నెగ్గర్‌ అన్నారు. ఇటీవల కనెక్టికట్‌లో స్కూలు పిల్లల హత్యకు సినిమాలకు సంబంధం ఉందని విమర్శకులు గగ్గోలు పెడుతున్నారు. 'ది లాస్ట్‌ స్టాండ్‌' చిత్రప్రచార సందర్భంగా ఆయన మాట్లాడారు. చిత్రానికి నిజజీవితాని కి తేడాను ప్రజలు గ్రహించాలని కోరారు.

    ష్వాన్‌ నెగ్గర్‌ ఏక్షన్‌ చిత్రాలకు పెట్టింది పేరు. కనీస ఇంగితజ్ఞానం కలిగిన ప్రేక్షకులు వాస్తవానికి సినిమాకు తేడా గ్రహించగలరు. సినిమా సమాజంలో ఒక భాగం. హింసను నిరోధించేందుకు మెరుగైన కృషి చేస్తోంది. సినిమాల నుంచి పూర్తిగా హింసను తీసివేయలేం. మానసిక వికృతి కల ప్రజలు ఎప్పుడూ ఉంటారు. ట్రిగ్గర్‌ నొక్కి సంతోషించటం వారి మానసిక వికల్పం. ప్రశ్న ఏమంటే మనం ఏంచేయగలం? అని అన్నారు.

    నేషనల్‌ రైఫిల్స్‌ సంఘాన్ని తప్పుపట్టలేం. తుపాకీతయారుదారులను తప్పుపట్టలేం. .ఎవరినీ సమర్ధించటం లేదు. కాని కాల్పులు జరిపి చంపటం అనేది మానసిక వ్యాధి మాత్రమే అని చెప్పారు. డిసెంబర్‌ 12 కనెక్టికట్‌ స్కూలులో 20 మంది పిల్లలను కాల్చి చంపిన సంఘటన తనకు దిగ్భ్రాంతి కలిగించిందని చెప్పారు.

    ఆర్నాల్డ్‌ స్వార్జ్‌నెగ్గర్ ఓ యాక్టర్, ఓ మోడల్, ఓ పోలిటీషియన్ ఇలా ఆయన గురించి మనం చాలా చెప్పుకోవచ్చు. ఆయన నటించినటువంటి టెర్మినేటర్ ఆయనకి ఎంత పేరు తెచ్చిపెట్టిందో యావత్ ప్రపంచం మొత్తానికి తెలుసు. ఓ యాక్టర్ కంటే కూడా ఆర్నాల్డ్‌ స్వార్జ్‌నెగ్గర్ కాలిఫోర్నియా రాష్ట్రానికి గవర్నర్ గాబాగా సుపరిచితం. కాలిఫోర్నియా రాష్ట్రానికి గవర్నరైన తర్నాత ఆర్నాల్డ్‌ స్వార్జ్‌నెగ్గర్ సినిమాలలో నటించడం బాగా తగ్గించారు. దానికి కారణం రాజకీయ బాద్యతలకు మరియు సినిమాలకు లింకు కుదరక పోవడమే.

    రాజకీయాల్లోకి వెళ్శిన తర్వాత సినిమా ఇండస్టీ మీద ఆర్నాల్డ్‌ స్వార్జ్‌నెగ్గర్ పట్టుని కోల్పోయారని కోంత మంది సినీ విశ్లేషకులు అనడం హాస్యాస్పదంగా ఉందని అయన అన్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఇటీవల కాలంలో సిల్వస్టర్‌ స్టాలోన్ దర్శకత్వం వహించినటువంటి ఎక్స్ పెండబుల్స్ చిత్రంలో నటించిన విషయం అందరికి తెలిసిందే..

    English summary
    'Commando' famed actor Arnold Schwarzenegger is promoting his new all-action film 'The Last Stand' and insisted people "know the difference" between movie and real-life violence, reported USA Today
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X