»   » హాలీవుడ్ స్టార్ ‘ఆర్నాల్డ్ స్వ్కార్జ్ నెగ్గర్’ మరణించాడంటూ పుకార్లు

హాలీవుడ్ స్టార్ ‘ఆర్నాల్డ్ స్వ్కార్జ్ నెగ్గర్’ మరణించాడంటూ పుకార్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ప్రపంచ ప్రఖ్యాత నటుడు, హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ స్వ్కార్జ్ నెగ్గెర్ ఆకస్మికం కన్నుమూసారంటూ ప్రచారం జరిగింది. కొన్ని టీవీ ఛానల్స్ ఈ విషయాన్ని బ్రేకింగ్ న్యూస్ గా వేడయంతో అంతా నిజమే అనుకున్నారు. అయితే ఇదంతా వట్టి పుకార్లే అని తేలిపోయింది. అతడు చనిపోయాడంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చిన తర్వాత... ప్రముఖ హాలీవుడ్ మూవీ ‘ది ఎక్స్‌స్పెండబుల్స్’ నిర్మాతతో కలిసి ఆర్నాల్డ్ లంచ్ చేసిన ఫోటోలు డైలీ మెయిల్ ప్రచురించింది.

"68 ఏళ్ల వయసున్న అర్నాల్డ్ లాస్ ఏంజెలెస్ లోని కాలిఫోర్నియా హోంలో బెడ్ పై విగతజీవిగా కనిపించారు. లాస్ ఏంజెలెస్ పోలీసులకు చెందిన 911 నెంబర్ కు ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. అన్ రెస్పాన్సివ్ మేల్ (స్పందించని పురుషుడు) అంటూ ఈ కాల్ వచ్చింది. వెంటనే అక్కడకు వెళ్లిన పోలీసులు అర్నాల్డ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాత్రి 9.30 గంటల ప్రాంతలో అతను చనిపోయి ఉండవచ్చని లాస్ ఏంజెలెస్ పోలీస్ చీఫ్ జేమ్స్ జె.ఫ్రీదా తెలిపారు. అర్నాల్డ్ మృతికి గల కారణాలు తెలియరాలేదని... ఈ మృతిపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని ఆయన చెప్పారు. మరోవైపు, అర్నాల్డ్ మృతిని అతని కుటుంబానికి సన్నిహితుడైన ఒక వ్యక్తి కూడా ధ్రువీకరించారు" అంటూ కొన్ని ఇంటర్నేషనల్ వెబ్ సైట్లలో, సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. 

అయితే, అర్నాల్డ్ ప్రతినిధులు నిన్న ఈ వార్తను కొట్టిపారేశారు. అర్నాల్డ్ కు ఏమీ కాలేదని, ఆరోగ్యంగా, హాయిగా ఉన్నారని స్పష్టం చేశారు. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని సూచించారు. మరోవైపు, తన అధికారిక ట్విట్టర్ పేజ్ లో అర్నాల్డ్ తన ట్వీట్లను పోస్ట్ చేస్తూనే ఉన్నారు.

Arnold Schwarzenegger found dead of apparent heart attack

1947, జూలై 30న జన్మించిన ఒక ఆస్ట్రియన్-అమెరికన్. బాడీ బిల్డర్ గా, హాలీవుడ్ నటుడుగా, మోడల్ గా, వ్యాపారవేత్తగా మరియు రాజకీయనాయకుడిగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచాడు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర 38వ గవర్నరుగా సేవలందించారు.

కొనాన్ ది బార్బేరియన్ , ది టెర్మినేటర్ మరియు కమాండో తదితర చిత్రాల్లో నటించిన స్క్వార్జెనెగర్ హాలివుడ్ యాక్షన్ ఫిలిం చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా పేరు గడించారు. ఆయన నటించిన చివరి చిత్రం ‘టెర్మినేటర్- జెనిసీస్' ఇటీవలే విడుదలై భారీ విజయం సాధించింది.

English summary
In fact, Schwarzenegger is so not dead, he recently had lunch with “Expendables” producer Robert Earl in Los Angeles, which means that there might be a fourth sequel in the franchise.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu