»   » ‘టెర్మినేటర్’ హిరో మూడుముక్కలాట..!!

‘టెర్మినేటర్’ హిరో మూడుముక్కలాట..!!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హాలీవుడ్ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక స్టార్‌డమ్ సంపాదించుకోవటమే కాకుండా, ఆ పలుకుబడితో కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నరుగా ఎన్నికయిన హాలీవుడ్ ఏక్షన్ హిరో ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ నుండి విడాకులు కోరుతూ అతని భార్య మేరియా ష్రివర్ కోర్టు మెట్ల ఎక్కింది. టర్మినేటర్ వంటి పాత్రలతో విశేషాజనధారణను సొంతం చేసుకున్న ఈ అగ్రనటుడు అక్రమ సంబంధంతో తన వైవాహిక జీవితాన్ని టెర్మినేట్ చేసుకున్నాడు. తన ఇంటిలో పనిచేసే ఒక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఈ కండల ధీరుడు పదేళ్ల క్రితమే ఒక బిడ్డను కూడా కన్నాడని వార్తా సంస్థలు కొన్ని నెలల క్రితం బయటపెట్టాయి.

  ష్వార్జ్ నెగ్గర్ నుంచి విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకున్న మేరియా పాతికేళ్లుగా భర్తతో కాపురం చేస్తోంది. మాజీ జర్నలిస్టు అయిన ఆమెకు నలుగురు పిల్లలు. అక్రమ సంబంధంతో తన భర్త ఓ బిడ్డకు జన్మనిచ్చాడని తెలిశాక మేరియా భర్త నుంచి విడిపోయి వేరే ఇంటిలో జీవనం సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆమె పిల్లలో మైనారటీ తీరిన ఇద్దరు ఉమ్మడి సంరంక్షణలో ఉండాలని ఆమె కోరుకుంటున్నట్లు 'బీబీసీ" తెలిపింది. విడాకులకు సంబంధిచి దాఖలు చేసిన పిటీషన్లో ' పరిష్కిరించుకోవడానికి వీలుకాని విభేధాలు వలన" విడిపోయేందుకు సిద్ధపడుతున్నట్లు మేరియా పేర్కొంది. తాము విడిపోయినప్పటికి మైనారిటీ తీరని తమ ఇద్దరు పత్రులు ఉమ్మడి సంరక్షణలో ఉండాలని మేరియా కోరింది.

  2003 కాలీఫోర్నియా రాష్ట్రగవర్నర్‌గా రిపబ్లికన్ పార్టీ తరుపున పోటి చేసి గెలిచిన ష్వార్జ్ నెగ్గర్, గత జనవరిలో తన పదవికి రాజీనామా చేశాడు. సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకోవడం వల్ల తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో చక్రం తిప్పగల కిటుకు బహుశా 'ఆర్నల్డ్ " గారికి తెలిసినట్లు లేదు. భారత దేశంలో అనేక మంది నటీనటులు తమ నటనా జీవితం ద్వారా సంపాదించుకున్న పేరు ప్రతిష్టలను, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఎన్నికయిన తరవాత కూడా నిరభ్యంతరంగా కొనసాగిస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ప్రజా సమస్యలను పట్టించుకోవల్సిన వీరు సమస్యలను గాలికొదిలేసి నట సంపాదనలో పడిపోతున్నారు.

  ఇక్కడ మన హలీవుడ్ హిరో గారు భారతీయ నట రాజకీయనాయకుల కంటే ఒకాకు ఎక్కువే చదివినట్లున్నరు. అటు హాలీవుడ్ సినిమాలతో పాటు రాజకీయ జీవితంలో నటిస్తూనే నిజ జీవితంలో భర్తగా కూడా మంచి నటనను కనబర్చారు. సినిమా ప్రపంచంలో హిరోగా గుర్తింపుపొందని ఆర్నల్డ్ ష్వార్జ్ నెగ్గర్, నిజజీవితంలో మాత్రం భార్య మేరియా ష్రివర్‌తో పాటు కాలిఫోర్నియో ప్రజల పాలిట విలన్‌గా గుర్తింపుతెచ్చుకున్నారు. ష్వార్జ్ నెగ్గర్, మేరియా ష్రివర్‌ల వివాహనికి ముందు సంపాదన విషయంలో ఎటువంటి ఒప్పందం చేసుకోలేదట. కనుక అమెరికా చట్టాల ప్రకారం ష్వార్జ్ నెగ్గర్ ఆస్తుల్లో మేరియాకు సగ భాగం వస్తుందని తెలుస్తోంది.

  English summary
  Maria Shriver hired big time divorce lawyer in Arnold Schwarzenegger case. According to People.com, Maria Shriver has now hired a big time divorce lawyer by the name of Laura Wasser to represent her in the possible divorce case against cheating hubby Arnold Schwarzenegger.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more