»   » ఇది ఆర్నాల్డ్‌ ... 'బాహుబలి‌'

ఇది ఆర్నాల్డ్‌ ... 'బాహుబలి‌'

Posted By:
Subscribe to Filmibeat Telugu

న్యూయార్క్ : సీక్వెల్స్ చుట్టూ ఇప్పుడు సిని ప్రపంచం తిరుగుతోంది. ఆల్రెడీ సూపర్ హిట్టైన సినిమాలను వెతికి సీక్వెల్స్ చేసే పనిలో సిని పెద్దలు బిజీగా ఉన్నారు. హాలీవుడ్ లో చాలా కాలం నుంచి ఈ వరస నడుస్తోంది. సీనియర్ హీరోలు తమ పాత చిత్రాలలో బాగున్నవాటిని సీక్వెల్ గా మార్చటానికి ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా కత్తి యుద్దాలు వంటి బాహుబలి తరహా కథాంశం అంటే ఆ కిక్కే వేరు. తాజాగా అలాంటి ప్రయత్నమే...ఆర్నాల్డ్ చేయబోతున్నారు. ఆ సినిమా..దాని విశేషాలు ఏమిటీ అంటే...

1982లో విడుదలైన హాలీవుడ్‌ చిత్రం 'కానన్‌ ది బార్బేరియన్‌' అప్పట్లో ఘన విజయం సాధించింది. అందులో హీరోగా నటించిన ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగర్‌ చేసిన కత్తి విన్యాసాలు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాయి. దీనికి సీక్వెల్‌గా 1984లో వచ్చిన 'కానన్‌ ది డెస్ట్రాయర్‌'లోనూ ఆర్నాల్డే హీరోగా నటించాడు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Arnold Schwarzenegger to return as Conan the Barbarian 30 years on

దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత ఇప్పుడు మరోమారు ఆర్నాల్డ్‌ కత్తి యుద్దం చేసి, తన అభిమానులను అలరించటానికి సిద్ధమవుతున్నాడు. 'ది లెజెండ్‌ ఆఫ్‌ కానన్‌' పేరుతో కానన్‌ సిరీస్‌లో మరో సీక్వెల్‌ను రూపొందించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ విషయమై ఆర్నాల్డ్‌ ఆనందం వ్యక్తం చేశాడు.

ఆర్నాల్డ్ మాట్లాడుతూ...''కానన్‌ సిరీస్‌లో మరో చిత్రం చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. నా కోరిక ఇప్పటికి కార్యరూపం దాల్చింది. ఈ సినిమా చిత్రీకరణ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. 67 ఏళ్ల వయసులోనూ నా సినిమాల సీక్వెల్స్‌లో నటించే అవకాశాలు రావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను'' అన్నాడు ఆర్నాల్డ్‌.

English summary
Arnold Schwarzenegger will revisit his breakthrough role by appearing in a new sequel to 1982's Conan the Barbarian, the film's producer has confirmed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu