twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ చిత్రం అబద్ధాల పుట్ట అంటూ వెబ్ సైట్ ఫైర్

    By Srikanya
    |

    లండన్‌: రహస్య పత్రాలను బట్టబయలు చేసి లోగడ అమెరికా సహా అనేక దేశాల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన 'వికీలీక్స్‌' వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజ్‌, ఇప్పుడు తన వెబ్‌సైట్‌పై తీస్తున్న ఒక హాలీవుడ్‌ చిత్రాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఈ సినిమా ఒక అబద్ధాల పుట్ట అని ఆరోపించారు. వెబ్‌సైట్‌తోపాటు సిబ్బంది వ్యక్తిత్వంపై పెద్దయెత్తున దుష్ప్రచారానికే దీనిని తీస్తున్నారని మండిపడ్డారు. 'ద ఫిప్త్‌ ఎస్టేట్‌' నవంబరులో విడుదల కానుందని, ఈ చిత్రం కథన ప్రతి(స్క్రిప్టు) నకలు తన వద్ద ఉందని తెలిపారు.

    బ్రిటన్‌లోని ఈక్వెడార్‌ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న అసాంజ్‌ తాజాగా అక్కడి నుంచి వీడియో అనుసంధానం సాయంతో ప్రతిష్ఠాత్మక ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ఇరాన్‌ అణు బాంబు తయారీకి ప్రయత్నిస్తోందనే అర్థం వచ్చే దృశ్యాలు సినిమాలో చూపించి, ఆ దేశంపై యుద్ధం ఆలోచనలకు వూతమిస్తున్నారని ఆరోపించారు.

    అసలు ఈ అంశం వెబ్‌సైట్‌కు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు.అందులోంచి కొన్ని వివరాలను ఆయన చదివి వినిపించారు. తాము వికీలీక్స్‌పై సినిమా చిత్రీకరణ ప్రారంభించామని డ్రీమ్‌వర్క్స్‌ స్టూడియోస్‌ సంస్థ మంగళవారం ప్రకటించింది. ఇందులో అసాంజ్‌గా బ్రిటన్‌ నటుడు బెనెడిక్ట్‌ కుంబర్‌బాచ్‌ కనిపిస్తున్నారు. చిత్రానికి బిల్‌ కాండన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

    English summary
    WikiLeaks founder Julian Assange hit out at a Hollywood film about his secret-spilling website, calling the movie “a massive propaganda attack”. Speaking to students at Britain's prestigious Oxford University by video link from the Ecuadoran embassy in London, Mr Assange revealed that he had acquired a copy of the script for “The Fifth Estate”, due to be released in November. “It is a lie upon lie. The movie is a massive propaganda attack on WikiLeaks and the character of my staff,” the Australian Internet activist told the audience at the university's Oxford Union debating club.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X