»   » మరో సంచలనానికై 'అవతార్-2' సిద్ధమవుతోంది..!!

మరో సంచలనానికై 'అవతార్-2' సిద్ధమవుతోంది..!!

Subscribe to Filmibeat Telugu

ప్రపంచ వ్యాప్తంగా విడుదలయి అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రంగా రికార్డులు సృష్టించిన అవతార్ సినిమాకు సీక్వెల్ అవతార్-2 కు రంగం సిద్ధమవుతోంది. ఇదివరకే అవతార్ ను సృష్టించిన జేమ్స్ కామెరూన్ ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో వున్నట్టు తెలిపారు. కాగా ప్రస్తుతం అవతార్ సినిమాను రూపొందించిన 20th సెంచరీ ఫాక్స్ సంస్థ ఈ సీక్వెల్ కోసం టెక్నికల్ డిపార్ట్ మెంట్ ను ఎంపిక చేసే పనిలే నిమగ్నమయింది. ఎంపికయిన వారితో మూడు నుండీ ఐదేళ్లకు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు.

అయితే ఈ సినిమా అప్పట్లో విడుదలయ్యే అవకాశాలు లేవు. 2013వ సంవత్సరం క్రిస్ట్ మస్ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు వున్నాయని విశ్వసనీయ సమాచారం. ఈ సినిమాలో నటించడానికి అవతార్ నాయకుడు శ్యామ్ వర్తింగ్టన్ ఇప్పటికే సమ్మతించాడు. నాయికగా అవతార్ లో నటించిన జియో సల్దానానే ఎంపిక చెయ్యనున్నారని సమాచారం. తొలి భాగంలో యుద్ధంతో ముగియడంతో, మలి భాగం యుద్ధపర్యావసానాల మీద వుంటుందని సమాచారం. అయితే మరో సారి బాక్సాఫీస్ ను షేక్ చెయ్యడానికి జేమ్స్ కామెరూన్ సిద్ధం అవుతున్నారన్నమాట...!! ఈ సినిమా కూడా అన్ని రికార్డులను తుడిచిపెట్టేసి సరికొత్త రికార్డులను సృష్టించాలని ఆశిద్దాం.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu