Don't Miss!
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Avatar 2 సెన్సార్ రివ్యూ.. మూడు గంటలకుపైగా రన్ టైమ్.. ఫస్ట్ టాక్ ఏమిటంటే?
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సినీ లవర్స్ ఎదురుచూస్తున్న విజువల్ వండర్ మూవీ అవతార్ 2: ద వే ఆఫ్ వాటర్ డిసెంబర్ 16వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. ఇండియాలో ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను ఇటీవల వీక్షించిన సెన్సార్ యూనిట్ సభ్యులు పాజిటివ్ గా స్పందించారు. ఇక మూడు గంటలకు పైగా ఈ సినిమా నిడివి ఉన్నట్లుగా తెలుస్తోంది. అసలు ఈ సినిమా ఫస్ట్ టాక్ ఎలా ఉంది అలాగే రన్ టైం ఎంత? ఏ సర్టిఫికెట్ ఇచ్చారు? అనే వివరాల్లోకి వెళితే..

భారీ బడ్జెట్ తో అవతార్ 2 నిర్మాణం
అవతార్ ఫస్ట్ పార్ట్ వచ్చి దాదాపు 13 ఏళ్ళు అయినప్పటికీ కూడా దాని క్రేజ్ అయితే ఏ మాత్రం తగ్గలేదు. ఇక ఇప్పుడు దర్శకుడు జేమ్స్ కామరూన్ అవతార్ 2 సినిమాను అంతకుమించి అనేలా తెరపైకి తీసుకురాబోతున్నాడు. 3D టెక్నాలజీతో సరికొత్తగా ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకోబోతోంది. ఈ సినిమాను దాదాపు 250 మిలియన్ల డాలర్లతో నిర్మించారు. అంటే మన ఇండియన్ కరెన్సీ లో దాదాపు రూ.1909 కోట్లతో సమానం.

అడ్వాన్స్ బుకింగ్స్
అవతార్ 2 సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఆన్లైన్లో ఓపెన్ అయ్యాయి. ఇక 4DX కు సంబంధించిన టికెట్లు అయితే మొదటి రోజే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ సినిమా టికెట్ల రేట్లు చూస్తే కూడా షాక్ అవ్వాల్సిందే. ముఖ్యంగా బెంగుళూరు థియేటర్లలో అయితే సినిమా అత్యధికంగా 1400 రూపాయల రేంజ్ లో ఒక టికెట్ ను అమ్ముతున్నారు. దీన్నిబట్టి సినిమా ఒక్కరోజులోనే ఊహించిన విధంగా ఇండియాలోనే 70 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకోవచ్చు అని తెలుస్తోంది.

సెన్సార్ వర్క్ ఫినిష్
2009లో వచ్చిన అవతార్ ఫస్ట్ పార్ట్ కు కొనసాగింపుగా వస్తున్న అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ పై అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు అయితే పూర్తయ్యాయి. ఇక ఇటీవల ఇండియన్ సెన్సార్ బోర్డు నుంచి ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ వచ్చింది. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను పిల్లలు కూడా చూడవచ్చు అని వారి నుంచి రియాక్షన్ వచ్చింది.

సెన్సార్ టాక్
ఇక ఈ సినిమాను చూసిన సెన్సార్ యూనిట్ సభ్యులు చాలా పాజిటివ్ గా స్పందించినట్లు కూడా తెలుస్తోంది. సినిమాలో మొదటి పార్ట్ కంటే ఇప్పుడే విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండబోతున్నాయని ముఖ్యంగా కొన్ని 3D షాట్స్ అయితే అద్భుతంగా ఉన్నాయని తప్పకుండా యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్ ను కట్టిపడేస్తాయి అని కూడా అన్నారు. అలాగే ఈసారి ఈ పాండోరా ప్రపంచంలో ఉండే ఎమోషన్ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది అని తెలిపారు.

రన్ టైమ్ ఎంతంటే..
ఇక అవతార్ 2 సినిమా రన్ టైమ్ అయితే ఊహించిన విధంగా ఎక్కువ స్థాయిలో ఉంది. మొత్తంగా 192 నిమిషాల 10 సెకన్లుగా ఈ సినిమా రన్ టైమ్ ఫిక్స్ అయ్యింది. అవతార్ 1 కేవలం 162 నిమిషాలతో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈసారి అవతార్ 2 మూడు గంటలకు పైగా నిడివితో ప్రేక్షకులకు వస్తుండడం విశేషం. మరి ఫైనల్ గా సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.