»   »  'అవతార్‌ 2' రిలీజ్ డేట్ ఖరారు

'అవతార్‌ 2' రిలీజ్ డేట్ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ఆరేళ్ల క్రితం జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అద్బుతం 'అవతార్'. ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానులను ఎంత మెప్పించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమాకు సీక్వెల్ చేస్తానని కామెరూన్ ప్రకటించారు. అయితే అది ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ఇన్నాళ్లూ మిస్టరీగా మిగిలిపోయింది. అయితే అభిమానుల నిరీక్షణ ఫలించనుంది. 2017 క్రిసమస్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తారని అఫీషియల్ గా ప్రకటించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

'ఈ చిత్రాన్ని మొత్తం మూడు భాగాలు తెరకెక్కి స్తున్నాం. ఆద్యంతం వినూత్నంగా ఉండే ఈ చిత్రాన్ని 2017 క్రిస్మస్‌కి విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నాం' అని కామెరాన్‌ పేర్కొన్నట్లు న్యూస్‌ 24 మీడియా తెలిపింది.

Avatar 2 Release Date Finally Confirmed

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తయ్యిందని దర్శకుడు జేమ్స్‌ కామెరాన్‌ తెలియజేశారు. 'అవతార్' చిత్రంలో పండోరా గ్రహాన్ని సృష్టించి, సరికొత్త ప్రకృతి అందాలను తెరపై ఆవిష్కరించారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఆ చిత్రాన్ని ప్రపంచ సినీ అభిమానులు మర్చిపోలేరు. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్స్ రెడీ చేస్తున్నారాయన.

2016లో రెండో భాగాన్ని, 2017, 18 సంవత్సరాల్లో మూడు, నాలుగు భాగాలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించేశారు కూడా. కానీ, వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం లేదట. 2017 డిసెంబర్‌లో క్రిస్‌మస్ సందర్భంగా మొదటి సీక్వెల్‌ను, 2018, 2019 సంవత్సరాల్లో తర్వాతి భాగాలను విడుదల చేస్తామని ఇప్పుడు తాజాగా చెప్పారు కామెరూన్. అంటే 'అవతార్' పార్ట్2 కోసం మరో రెండేళ్లు నిరీక్షించక తప్పదు.

English summary
The production of “Avatar 2” is apparently coming along nicely, as James Cameron was finally able to confirm the official release date for the film, announcing that it’s scheduled for Christmas 2017.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu