»   » హాలీవుడ్ మూవీ అవతార్ 2 గురించి చేదు వార్త!

హాలీవుడ్ మూవీ అవతార్ 2 గురించి చేదు వార్త!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన హాలీవుడ్ మూవీ 'అవతార్' 2009లో విడుదలై సంచలన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మెచ్చిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది. ఇండియన్ ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.

ఈ సినిమాకు సీక్వెల్ గా అవతార్ 2, 3, 4, 5 పార్టులు కూడా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ప్రకటించిన దాని ప్రకారం అవతార్ 2 వచ్చే ఏడాది అంటే 2018లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని, 2018లో సినిమా రిలీజ్ అయ్యే అవకాశం లేదని అంటున్నారు దర్శకుడు జేమ్స్ కామెరూన్.

 ఆలస్యం ఎందుకు?

ఆలస్యం ఎందుకు?

సినిమా ఆలస్యానికి కారణం అవతార్ ఎంటైర్ టీమ్ కేవలం పార్ట్ 2 కోసమే కాకుండా.... భవిష్యత్తులో రాబోయే అన్ని సీక్వెల్స్ మీద పని చేస్తున్నారట. అందుకే పార్ట్ 2 రిలీజ్ డేట్ ఎప్పుడు? అనే విషయంలో కన్ఫర్మేషన్ ఇవ్వలేక పోతున్నారట.

ఒక్క పార్టుకే 4 సంవత్సరాలు

ఒక్క పార్టుకే 4 సంవత్సరాలు

ఫస్ట్ పార్ట్ అవతార్ సినిమా తీయడానికే నాలుగేళ్ల సమయం పట్టింది. ఇపుడు అవతార్ టీం మొత్తం 4 సీక్వెల్స్ మీద పని చేస్తోంది. అందుకే ఎక్కువ సమయం తీసుకుంటోందని, సినిమా రిలీజ్ ఆలస్యం కావడానికి కారణం అదే అని అంటున్నారు దర్శకుడు కామెరూన్.

ఎవరూ ఊహించని సాంకేతికత

ఎవరూ ఊహించని సాంకేతికత

అవతార్ తొలి పార్ట్ చూసే ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. కాబోయే నాలుగు పార్టులు ప్రపంచ సినీ ప్రేక్షకులను మరింత సంబ్రమాశ్చర్యాలకు గురి చేయబోతోంది. ఎవరూ ఊహించని సాంకేతిక పరిజ్ఞానం, విజువల్ ఎఫెక్ట్స్ రాబోయే సీక్వెల్స్ లో మనం చూడబోతున్నాం.

తన జీవితం అవతార్ సినిమాకే అంకితమన్న కామెరూన్

తన జీవితం అవతార్ సినిమాకే అంకితమన్న కామెరూన్

తన కెరీర్‌లో కేవలం అవతార్ సినిమాలు మాత్రమే తీస్తానని, అవతార్ ఐదో భాగం తీసే సమయాని నా జీవితం చివరి దశకు చేరుకుంటుంది అంటున్నారు కామరూన్. ప్రస్తుతం జేమ్స్ కామెరూన్ వయసు 62 సంవత్సరాలు.

ఒత్తిడి తప్పడం లేదు

ఒత్తిడి తప్పడం లేదు

కొత్త సినిమా అయినా, సీక్వెల్ అయినా.. ఏదైనా ఒత్తిడికి గురి చేస్తుందని, తన కెరీర్ మొత్తం ఈ ఒత్తిడ్ని అనుభవిస్తూ వస్తున్నానని, ఇప్పుడూ అదే స్థితిలో ఉన్నానని కామరూన్ తెలిపారు. ప్రస్తుతం ఈ సీక్వెల్స్ కోసం భారీ సెట్స్ వేయిస్తున్నామని, అలాగే, గ్రాఫిక్స్‌లో పలు కేరక్టర్లను సృష్టిస్తున్నామని చెప్పారు.

ఏడాదికి ఒకటి వరుసగా

ఏడాదికి ఒకటి వరుసగా

అవతార్ మొగిలిన నాలుగు పార్టులకు సంబంధించిన పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి. కామెరూన్ చెబుతున్న వివరాల ప్రకారం 2019లో లేదా 2010లో సెకండ్ పార్ట్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ప్రతి ఏడాదికి ఒకటి చొప్పున వరుసగా మిగిలిన సీక్వెల్స్ విడుదల కాబోతున్నాయి.

English summary
The much-anticipated release of the sequel to animated hit 2009 fantasy-sci-fi drama Avatar has been kept on hold yet again, and according to the director James Cameron, it will not be probably releasing in 2018 as expected earlier.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu