»   » అక్కడా రికార్డులు సృష్టిస్తున్న 'అవతార్'..!!

అక్కడా రికార్డులు సృష్టిస్తున్న 'అవతార్'..!!

Subscribe to Filmibeat Telugu

అమెరికాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలవడమే కాకుండా, టైటానిక్ సినిమా రికార్డులను సైతం అధికమించిన జేమ్స్ కామెరూన్ అద్భుత సాంకేంతిక మాయాజాలం అవతార్ సినిమా ఇతర దేశాల్లో కూడా రికార్డు స్థాయి కలెక్షన్లతో అదరగొడుతోంది. తాజాగా యుకే లో ఈ సినిమా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా అవతరించింది.

తొమ్మిది ఆస్కార్ నామినేషన్లు దక్కించుకున్న ఈ సినిమా విడుదలయిన ఎనిమిది వారాల్లో వరుసగా ఆరు వారాల పాటు బాక్సాఫీసు వద్ద ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తంగా ఎనిమిది వారాలకు ఈ సినిమా 72 మిలియన్ పౌండ్లను ఆర్జించి ఇంతకు ముందు అబా మ్యూజికల్స్ మామ్మామియా పేరుమీదున్న రికార్డును తుడిచిపెట్టేసి అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఈ ఘనతను సాధించింది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu