సంచనలం రేపిన హీరో హీరోయిన్లు ప్రేమాయణం సాగిస్తున్నారా..?
అవతార్ ఈ సినిమా పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు జేమ్స్ కామెరూన్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయి ఎన్ని అద్బుతాలు సృష్టించిందో చెప్పనక్కరలేదు. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహంచిన ఈ సినిమా ఎన్నో భారీ వసూళ్లు సాధించింది. మన దేశంలో కూడా సంచలనం రేపింది. ఈ సినిమా షూటింగ్ తర్వాత శ్యామ్ వర్తింగ్టన్, జియో సల్దానాలు ప్రేమలో పడ్డారని హలీవుడ్ సమాచారం. ఈ సినిమాకి రెండో భాగం రూపోందించే ఉద్దేశంలో వున్నారు జేమ్స్ కామెరూన్. అవతార్ లో 'పండోరా' అనే గ్రహం మీద నివసించే వ్యక్తులు చుట్టూ తిరుగుతుంది.
అవతార్-2లో ఇప్పుడు 'పండోరా'లోని జలాంతార్బాగాలలో నివసించే వారి చుట్టూ కధను అల్లే కార్యక్రమంలో వున్నారు జేమ్స్ కామెరూన్. ఈ సినిమాని కూడా చాలా సాంకేతికంగా ఉన్నత విలువలు తో తీర్చిదిద్దుతామని ఆయన చెబుతున్నారు. ఈ సినిమాలో జలాంతార్బాగాలలో నివసించే వారి జీవనశైలి ఎలా వుంటుందో అవతార్-2లో చూడడానికి రెడీ గా వుండమని ఆయన చెబుతున్నారు. అవతార్-2లో కూడా శ్యామ్ వర్తింగ్టన్, జియో సల్దానాలే హీరో హీరోయిన్లుగా నటించనున్నారు. జేమ్స్ కామెరూన్ ఈ సినిమా 4డి లో చెయ్యాలని అనుకున్నట్టు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











