»   » రికార్డు స్థాయి కలెక్షన్లు సరే, మరి అవార్డుల సంగతేంటి..!!

రికార్డు స్థాయి కలెక్షన్లు సరే, మరి అవార్డుల సంగతేంటి..!!

Subscribe to Filmibeat Telugu

జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన అద్భుత సాంకేతిక మాయాజాలం అవతార్ ప్రపంచంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన టైటానిక్ సినిమా పేరున వున్న ఈ రికార్డును అవతార్ సినిమా అధిగమించింది. కాగా ఇప్పుడు అవతార్ సినిమా అవార్డుల్లో కూడా టైటానికి రికార్డులను బ్రేక్ చేస్తుందా...?? హాలీవుడ్ లో ఇప్పుడిదే హాట్ టాపిక్. వచ్చే ఫిబ్రవరి 2వ తారీఖున ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల నామినేషన్లు ప్రకటిస్తుండటంతో అవతార్ సినిమా ఎన్ని నామినేషన్లు దక్కించుకోనుందో అని అందరూ ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

అవతార్, టైటానిక్ సినిమాలను ఓ సారి విశ్లేషిస్తే ఖచ్చితంగా రెండు సినిమాలు అద్భుతమయినవే. టైటానిక్ అద్భుత ప్రేమకథా చిత్రం అయితే, అవతార్ అద్భుత సాంకేతిక మాయాజాలం. కనుక అవతార్ సినిమాకు ఖచ్చితంగా ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకుడి విభాగాల్లో నామినేషన్లు లభిస్తాయి. కానీ ఉత్తమ నటీనటుల విభాగాల్లో అవతార్ సినిమాకు నామినీలు వచ్చే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. వికలాంగ నావికుడిగా, అవతార్ గా శ్యామ్ వర్తింగ్టన్ నటన, నావీల రాకుమారి నెయిత్రిగా జియో సాల్దాన్ నటన బాగున్నా సాంకేతికత వారి నటనను డామినేట్ చేసిందని చెప్పవచ్చు. ఇక సైంటిస్టు పాత్రలో జీవించిన సిగోర్నీ వీవర్ కు ఉత్తమ సహాయనటి విభాగంలో నామినేషన్ లభించే అవకాశాలు వున్నా, నాయకానాయికలకు ఈ అవకాశం లేదని చెప్పవచ్చు. ఇక టైటానిక్ సినిమాలో రోజ్ పాత్రలో అద్భుత నటనకు గాను కేట్ విన్స్లెట్ కు ఉత్తమ నటి విభాగంలో నామినేషన్ వచ్చినా అవార్డును సొంతం చేసుకోలేకపోయింది. కానీ లినార్డినో కు నామినేషన్ కూడా దక్కలేదు.

ఇక టైటానిక్ సినిమాలో అద్భుతమయిన సంగీతం వుంది. దీంతో ఈ సినిమాకు ఉత్తమ పాట విభాగంలో నామినేషన్ దక్కింది. కానీ అవతార్ కు ఆ అవకాశం లేదు. ఇలా మొత్తంగా విశ్లేషిస్తే అవతార్ అద్భుత సినిమాయే కావచ్చు, రికార్డుల్లో రారాజే కావచ్చు కానీ అవార్డుల్లో యావరేజీ అనే చెప్పాలి. మొత్తంగా 14 అకాడమీ నామినేషన్లు దక్కించుకొని, అందులో 11 విభాగాల్లో అవార్డు దక్కించుకున్న టైటానిక్ రికార్డును అవతార్ అధికమించడం అసాధ్యమనే చెప్పవచ్చు.

Please Wait while comments are loading...