అవతార్ '3డి'లో కాదంట..!
జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన అవతార్ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ప్రపంచ రికార్డులన్నింటినీ తిరగరాసిన అద్భుతమయిన 3డి సినిమా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ సినిమా డివిడి మాత్రం 2-డి వెర్షన్ లో మాత్రమే విడుదల అవుతుందట. తొలుత ఈ డివిడిని 3డి వెర్షన్ లో విడుదల చెయ్యదలచినా ఆ తర్వాత చర్చల అనంతరం ఈ డివిడిని 2డి వెర్షన్ లోనే విడుదల చెయ్యాలనుకుంటున్నట్టు 12th సెంచరీ ఫాక్స్ సంస్థ ప్రకటించింది.
ఈ 3డి వెర్షన్ డివిడిని చూడటానికి 3డి వెర్షన్ టివిలు చాలా మందికి అందుబాటులో లేనందును, దీనికి తోడు ఈ 3డి వెర్షన్ డివిడి ధర కూడా అధికం అవనుండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతానికి ఈ డివిడి 2డి వెర్షన్ లో విడుదల అవుతున్నా... 3డి టివిల టెక్నాలజీ ఊపందుకున్నాకా 3డి వెర్షన్ డివిడిని కూడా విడుదల చేస్తామని 12th సెంచరీ ఫాక్స్ సంస్థ ప్రకటించింది.


Click it and Unblock the Notifications











