»   » ప్రపంచసినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా 'అవతార్'..!!

ప్రపంచసినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా 'అవతార్'..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన అద్భుత సైన్స్ ఫిక్ మూవీ 'అవతార్' సినిమా వరుసగా రికార్డులను సృష్టిస్తూ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకూ ప్రపంచ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా టైటానిక్ పేరిట వున్న రికార్డును కూడా ఈ సినిమా అధికమించి ప్రపంచంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అవార్డులను మినహాయించి ఈ సినిమా బద్దలుకొట్టడానికి మరే రికార్డులు మిగల్లేదు అంటే అతిశయోక్తి కాదేమో. అంతగా ఈ సినిమా జనాన్ని, రికార్డులను ఆకర్షించింది మరి.

1997లో జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన అద్భుత ప్రేమకథా చిత్రం టైటానిక్ మొత్తంగా 1.84 బిలియన్ డాలర్లను వసూలు చేసింది. కాగా అవతార్ సినిమా గత సోమవారం వసూళ్లతో కలిపి మొత్తంగా 1.859 బిలియన్ డాలర్లను వసూలు చేసి అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రిటర్న్ ఆఫ్ ది కింగ్', 'పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్: డెడ్ మ్యాన్స్ చెస్ట్', 'ది డార్క్ నైట్' చిత్రాలు నిలిచాయి.

ప్రపంచసినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి ఐదు చిత్రాలు:
1. అవతార్ ---- 1.859 బిలియన్ డాలర్లు
2. టైటానిక్ ---- 1.843 బిలియన్ డాలర్లు
3. లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రిటర్న్ ఆఫ్ ది కింగ్ ---- 1.119 బిలియన్ డాలర్లు
4. పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్: డెడ్ మ్యాన్స్ చెస్ట్ ---- 1.066 బిలియన్ డాలర్లు
5. ది డార్క్ నైట్ ---- 1.002 బిలియన్ డాలర్లు

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu