»   » ఆ హిట్ సినిమా కథనాదేనని రచ్చచేసి కోర్టు మొట్టికాయలు తిన్నాడు

ఆ హిట్ సినిమా కథనాదేనని రచ్చచేసి కోర్టు మొట్టికాయలు తిన్నాడు

Subscribe to Filmibeat Telugu

అవతార్ సినిమాకు ఆస్కర్ వేదికపైన చుక్కెదురైనా కోర్టులో మాత్రం అనుకూల తీర్పే వచ్చింది. చైనాకు చెందిన ఝో షామౌ అనే రచయిత అవతార్ సినిమా విడుదలయి రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టడంతో ఈ సినిమా కథను తను రాసిన 'ది లెజెండ్ ఆఫ్ బ్లూ క్రో' అనే నవల నుండీ దోచేసారని, అందుకు ప్రతిగా తనకు సినిమా వసూళ్లలో 8% వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోర్టులో దావా వేసాడు. తను 1997లో రాసిన ఈ నవలను 1999లో విడుదల చేసానని చెప్పాడు. అవతార్ సినిమా కథకు తన నవలకూ 80% వరకూ పోలికలు ఉన్నాయని ఆయన తన వాజ్యంలో తెలిపాడు.

ఇక కోర్టు విచారణకు హాజరయిన 20th సెంచరీ ఫాక్స్ ప్రతినిధి తమీ కథను 1995లోనే సిద్ధం చేసుకున్నట్టు అంటే ఝో షామౌ కంటే రెండు సంవత్సరాల ముందే తామీకథను సిద్ధం చేసుకున్నట్టు ఆధారాలు చూపడంతో ఈ కేసును కొట్టివేసిన కోర్టు ఝో షామౌకు మొట్టికాయలు వేసింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu