Don't Miss!
- News
బీజేపి ఛీఫ్ కు ప్రమాద ఘంటికలు.!అధిష్టానం టచ్ లో ఆ ఉద్యమ నేత.!"సన్ స్ట్రోక్" ప్రభావమేనా.?
- Sports
INDvsNZ : పృథ్వీ షాకు నో ఛాన్స్!.. పాండ్యాకు మూడో టీ20లో అగ్ని పరీక్ష!
- Finance
SBI: లోన్ తీసుకుంటే వడ్డీ డిస్కౌంట్.. అబ్బా SBI బలే ఆఫర్.. పూర్తి వివరాలు
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Automobiles
సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
- Lifestyle
Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..
Avatar: The Way Of Water Teaser వెండితెరపై ట్రైలర్.. మరో అద్భుతమైన ప్రపంచం రెడీ!
టైటానిక్ సినిమా తో ప్రపంచంలోనే అత్యధిక బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాను తెరకెక్కించిన నెంబర్ వన్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ అవతార్ సినిమాతో మరో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక 2009 లో వచ్చిన అవతార్ సినిమాకు మళ్ళీ కొనసాగింపుగా మరిన్ని సినిమాలను అందించబోతున్నారు. ఈ దర్శకుడు అందుకోసం ప్రత్యేకమైన టెక్నాలజీని కూడా సృష్టించుకోవడం జరిగింది. గత కొన్ని ఏళ్లుగా తదుపరి అవతార్ సీక్వెల్స్ ప్రాజెక్టులతోనే బిజీగా మారాడు. దర్శకుడు తప్పకుండా అంతకుమించి అనేలా ఈ సినిమాలతో మెప్పిస్తాడని అనిపిస్తోంది.
ఇటీవల విడుదలైన అవతార్ సెకండ్ పార్ట్ పోస్టర్స్ కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. 'ద వే ఆఫ్ వాటర్' అనే అవతార్ సెకండ్ వెర్షన్ ప్రస్తుతం ప్రపంచమంతా హాట్ టాపిక్ గా మారిపోయింది. సినిమాను ఈ ఏడాది డిసెంబర్లో విడుదల చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. అసలైతే గత ఏడాదిలోనే సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా పరిస్థితుల ప్రభావం వలన ఒక్కసారిగా ఆ ప్రణాళికలు తారుమారయ్యాయి. కానీ ఈ ఏడాది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

పవర్ ఫుల్ మూవీ డాక్టర్ స్ట్రేంజ్ తోపాటు థియేటర్స్ లో అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. బిగ్ స్క్రీన్ పై అవతార్ ట్రైలర్ ను చూడడం కోసం ఓ వర్గం వారు డాక్టర్ స్ట్రేంజ్ సినిమాకు కూడా వెళుతున్నారు. ఇక అందుకు సంబంధించిన ట్రైలర్ టీజర్ ను కూడా సోషల్ మీడియాలో విడుదల చేయడం జరిగింది. పండోరా గ్రహం నుంచి మరో వెర్షన్ కథను ఇందులో చూపించబోతున్నారు. వాటర్ అనే కాన్సెప్ట్ ను దర్శకుడు జేమ్స్ ఈ సినిమాలో ప్రధానంగా హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
మొదటి సీక్వెల్ జేక్ సల్లీ, నవి నెయిటిరి అలాగే వారి కుటుంబం ఒకరినొకరు సురక్షితంగా ఉంచుకోవడం కోసం ఫైట్ చేయాలని భావిస్తున్నారు. టీజర్ ట్రైలర్ లో పండోర ప్రకాశవంతమైన నీలి జలాలు, మొదటి భాగం నుండి ఎగిరే జీవులు అలాగే మొదటిసారిగా కొత్త తిమింగలం లాంటి జీవులను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. జేమ్స్ కామెరూన్ యొక్క అవతార్ ఫస్ట్ పార్ట్ 2009లో విడుదలైంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా 2.84 డాలర్ల బిలియన్లతో బాక్సాఫీస్ వద్ద ఆల్-టైమ్ రికార్డుగా అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది.
“Wherever we go, this family is our fortress.”
— Avatar (@officialavatar) May 9, 2022
Watch the brand-new teaser trailer for #Avatar: The Way of Water. Experience it only in theaters December 16, 2022. pic.twitter.com/zLfzXnUHv4
ది వే ఆఫ్ వాటర్ నాలుగు అవతార్ సీక్వెల్‌లలో ఒకటి. ఇక ఈ సంవత్సరం డిసెంబర్ 16న ఈ సినిమా విడుదల కానుంది. ఇక తప్పకుండా ఈ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలై ఊహించని కలెక్షన్స్ అందుకుంటుందని అనిపిస్తోంది. ఇక జేమ్స్ కెమెరున్ మరికొన్నేళ్ల పాటు అవతార్ సీరీస్ లతోనే బిజీ కానున్నారు. మరి ఈ సినిమాలు ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటాయో చూడాలి.