»   » 2010వ సంవత్సరంలో మోస్ట్ పైరెటెడ్ సినిమాగా అగ్రస్దానంలో ఆసినిమానే..

2010వ సంవత్సరంలో మోస్ట్ పైరెటెడ్ సినిమాగా అగ్రస్దానంలో ఆసినిమానే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

2010వ సంవత్సరం డిసెంబర్ వచ్చిందంటే చాలు ఆసంవత్సరం మొత్తం మీద ఎవరు టాప్ అంటూ చర్చలు జరుగుతుంటాయి. అందులో భాగంగానే 2010లో వచ్చినటువంటి అవతార్ సినిమా నిజంగానే అధ్బుతాలు చేసింది. ఈసినిమాన తీసినటువంటి డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ మనుషులను నిజంగా ఓఊహాల ప్రపంచంలోనికి తీసుకోని వెళ్శాడు. అందుకే కాబోలు ఈసినిమాకు ప్రపంచం మొత్తం మీద అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఆస్కార్ అవార్డుల పంట కూడా పండింది. ఇదోక రికార్డు ఐతే ఇంకోక సరికొత్త రికార్డుని కూడా నెలకోల్పింది మన అవతార్.

ఈసరికొత్త రికార్డు ఏమిటంటే 2010వ సంవత్సరానికి గాను మోస్ట్ పైరెటెడ్ సినిమాగా రికార్డు సాధించింది. సినిమాలను డౌన్ లోడ్ చేసుకునేటటువంటి బ్లాగ్ టోరెంట్ ఫ్రీక్ ఇటీవలే ఈవిషయాన్ని ధృవీకరించింది. మొత్తం ప్రపంచం మీద అవతార్ సినిమాని బిట్ టోరెంట్ వెబ్ సైట్ లో16,580,000 సార్లు డౌన్ లోడ్ చేసుకున్నారని సమాచారం. పోయిన సంవత్సరం టాప్ మోస్ట్ పైరెటెడ్ సినిమాగా నిలిచినటువంటి స్టార్ ట్రెక్ తోపోల్చుకుంటే ఈసంవత్సరం 33శాతం డౌన్ లోడ్స్ పెరిగాయన్నారు.

ఇక రెండవ స్దానంలో సూపర్ హీరో కిక్ యాస్ అనే సినిమా 11,400,000సార్లు డౌన్ లోడ్స్ చేసుకున్నారు. ఇక సినిమా బాక్సాఫీసు విషయాలకు వస్తే అవతార్ సినిమాకు గాను 2.8 బిలియన్ డాలర్లు బాక్సాఫీసు కలెక్షన్లు వసూలు చేయగా, కిక్ యాస్ అనే సినిమా 48మిలియన్ డాలర్లు బాక్సాఫీసు కలెక్షన్లు వసూలు చేసింది. ఇక మూడవ స్దానంలో ఇన్ సెప్సన్, నాల్గవ స్దానంలో షట్టర్ ఐస్ లాండ్, ఐదవ స్దానంలో ఐరన్ మ్యాన్ 2నిలచాయి.

English summary
James Cameron""s 3D sci-fi epic ‘Avatar’ was the most pirated movie of 2010. Avatar, which became the highest-grossing film of all time in 2010, was illegally downloaded from Bit Torrent websites 16,580,000 times, according to the blog Torrent Freak.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu