»   » మరోసారి సత్తా చాటిన జేమ్స్ కామెరూన్ 'అవతార్'

మరోసారి సత్తా చాటిన జేమ్స్ కామెరూన్ 'అవతార్'

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇన్నాళ్లు రికార్డుల్లో అదరగొట్టి, అవార్డుల్లో బెదిరిపోయిన జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన అవతార్ సినిమా ఈ దఫా అవార్డుల్లో కూడా సత్తాచాటింది. కానీ ఈ అవార్డులు 3-డి సినిమాలకు అందించే అవార్డులు కావడం గమనార్హం. ఇటీవలే ప్రారంభమయిన ఇంటర్నేషనల్ 3-డి సొసయిటీ తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకటించిన అవార్డుల్లో ఏకంగా ఆరు అవార్డులను గెలుచుకొని 3-డిలో తిరుగులేని రారాజుగా ఆవిర్భవించింది.

3-డి ఫీచర్ ఆఫ్ ది ఇయర్, 3-డి క్యారెక్టర్, 3-డి సీన్, లైవ్ యాక్షన్ 3-డి సినిమాటోగ్రఫీ, 3-డి విఎఫ్ఎక్స్ విభాగాల్లో అవార్డులను సాధించింది. ఈ అవార్డులతో పాటు ప్రజల ఓటింగ్ ద్వారా ఎంపిక చేసిన అవార్డును కూడా అవతార్ దక్కించుకుంది. ఈ సినిమాతో పాటు యానిమేషన్ మూవీ అప్, పార్ట్లీ క్లౌడీ, అండర్ ది సీ, జి-ఫోర్స్, కొరలైన్ సినిమాలు కూడా ఈ అవార్డుల్లో తలుక్కున మెరిసాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu