Don't Miss!
- Sports
INDvsNZ : క్లీన్‌స్వీప్‌పై టీమిండియా గురి.. మూడో వన్డేలో పరుగుల వరదే..!
- News
కొండగట్టుకు పవన్ కళ్యాణ్; వారాహికి పూజల వేళ.. తెలంగాణాలో జనసేన జోష్!!
- Finance
pm kisan: రైతులకు మోడీ సర్కారు శుభవార్త.. కోట్లాది మందికి ప్రయోజనం
- Lifestyle
Today Rasi Palalu 24 January 2023: ఈ రోజు మిథున రాశి వారికి శుభవార్తలు, ఆర్థిక పరిస్థి గొప్ప మెరుగుదల
- Automobiles
యాక్టివా కొత్త వేరియంట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్ - ధర & వివరాలు ఇక్కడ చూడండి
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Jeremy Renner: మంచు తొలగిస్తుండగా 'అవెంజర్' హీరోకు ప్రమాదం.. విషమంగా ఆరోగ్య పరిస్థితి
ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో విషాద సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు మరణంతో తనువు చాలిస్తుంటే మరికొందరు ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా హాలీవుడ్ నటుడు, మార్వెల్ హీరో జెరెమి రెన్నర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో గాయపడిన అతడిని హెలికాఫ్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఈ అవేంజర్స్ హీరోకు చికిత్స అందిస్తున్న వైద్యులు ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

మార్వెల్ సూపర్ హీరోగా..
మార్వెల్ సంస్థలో వచ్చే సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో.. అందులో నటించే హీరోలకు కూడా అంతకుమించి ఫ్యాన్ బేస్ ఉంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చే సినిమాలే కాదు అందులోని పాత్రలు కూడా ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంటాయి. అందుకే అలాంటి పాత్రలను కేవలం క్యారెక్టర్స్ కు మాత్రమే పరిమితం చేయకుండా ఆ రోల్స్ తో ప్రత్యేకంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు సైతం తెరకెక్కిస్తున్నారు.
అలా వాండా, లోకి, వింటర్ సోల్జర్ అండ్ ఫాల్కన్ వెబ్ సిరీస్ లతోపాటు సినీ అభిమానుల ముందుకు వచ్చిందే హాకీ వెబ్ సిరీస్. ఈ హాకీ వెబ్ సిరీస్ కంటే ముందే మార్వెల్ సూపర్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జెరెమి రెన్నర్.

35 వేల ఇళ్లకు..
ఇప్పుడు జెరెమి రెన్నర్ ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉందని వైద్యులు తెలిపారు. అమెరికాను మంచు తుపాను ముంచేసిన విషయం తెలిసిందే. అలా డిసెంబర్ 31 నుంచి జనవరి 1 లోపే రోడ్లపై 5 అడుగుల మేర రోడ్లపై మంచు కప్పేసి ఉంది. నెవాడాలో కూడా పరిస్థితి అలాగే ఉంది. మంచు తుపాను కారణంగా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం కూడా సంభవిస్తోందని అక్కడి రిపోర్టులు పేర్కొంటున్నాయి. 35 వేల గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ఎడమ చేయి మణికట్టు..
ఈ క్రమంలోనే మంచును తొలగిస్తూ 51 ఏళ్ల అవేంజర్ నటుడు జెరెమి రెన్నర్ గాయాలపాలయ్యాడు. జెరెమి రెన్నర్ ఇంటిపై భాగంలో భారీగా మంచు పేర్కొంది. దాన్ని తొలగిద్దామని భారీ వాహనంతో ప్రయత్నిస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. హెలికాఫ్టర్ ద్వారా అతన్ని హాస్పిటల్ కు తరలించారు. అతనికి వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని హాలీవుడ్ కు చెందిన ఓ వైబ్ సైట్ పేర్కొంది. జెరెమి రెన్నర్ కు కుడి మోచేయి.. ఎడమ చేయి మణికట్టు విరిగినట్లు సమాచారం.

రెండు సార్లు ఆస్కార్ కి..
ఇదిలా ఉంటే.. జెరెమి రెన్నర్ ఇప్పటికీ రెండు సార్లు ఆస్కార్ కు ఎంపికయ్యాడు. 2010లో ది హార్ట్ లాకర్ చిత్రానికి ఉత్తమ నటుడిగా, ది టౌన్ చిత్రంలో ఉత్తమ సహాయ నటుడిగా అకాడమీ అవార్డ్స్ కు ఎంపికయ్యాడు. జెరెమి రెన్నర్ అవేంజర్స్, హాకీ చిత్రాల్లోనే కాకుండా ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ మూవీ సిరీస్ మిషన్ ఇంపాజిబుల్ చిత్రాల్లో కూడా నటించాడు. ఇంకా అరైవల్, అమెరికన్ హాస్టిల్, 27 వీక్స్ తర్వాత వంటి చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం మేయర్ ఆప్ కింగ్స్ టౌన్ చిత్రంలో నటిస్తున్నాడు.