»   » ఢిల్లీ, బెంగుళూర్లలో ప్రదర్శనలు ఇవ్వనున్న 'బ్యాక్ స్ట్రీట్ బాయ్స్'..!!

ఢిల్లీ, బెంగుళూర్లలో ప్రదర్శనలు ఇవ్వనున్న 'బ్యాక్ స్ట్రీట్ బాయ్స్'..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అమెరికా పాప్ గ్యాంగ్, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న బ్యాక్ స్ట్రీట్ బాయ్స్ త్వరలో భారత్ లో ప్రదర్శన ఇవ్వనున్నారు. 'దిస్ ఈజ్ అజ్' వరల్డ్ టూర్ లో భాగంగా ప్రపంచం యావత్తూ ప్రదర్శనలు ఇస్తున్న ఈ బృందం రాక్ అండ్ ఇండియా పేరుతో భారత్ లో జరుగుతున్న ఏకైక అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్ లో భాగంగా ఢిల్లీ నగరంలోని NSIC లో ఫిబ్రవరి 20న, బెంగుళూరు నగరంలోని ప్యాలెస్ గ్రౌండ్స్ లో ఫిబ్రవరి 21న ప్రదర్శనలు ఇవ్వనున్నారు. టికెట్టు ధరను 1,500 నుండి 1,000 గా నిర్ణయించారు.

ఈ బృందంతో పాటు ప్రైమ్ సర్కిల్, రిచర్డ్ మ్యాక్స్, స్వర్థమ, ఇండిగో చిల్డ్రన్ మరియు జాయిసి లివిస్ గ్రూప్ లు కూడా ఇక్కడ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. 130 మిలియన్లకు పైగా రికార్డుల అమ్మకాలను కల్గిన బ్యాక్ స్ట్రీట్ బాయ్స్ ప్రదర్శనకై అందరూ ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu