»   » ఆకట్టుకుంటోన్న 'బవతార్' వీడియో..!!

ఆకట్టుకుంటోన్న 'బవతార్' వీడియో..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన అవతార్ సినిమా ఎంత ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ సినిమాకు పేరడీగా బవతార్ అనే పేరుతో రూపొందిన పేరడీ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో ప్రధాన తారాగణం మొత్తం పిల్లలే వుండటం విశేషం.

ఇక ఈ వీడియోలో ఓ చోట చిన్నపిల్లలందరూ కలసి జాక్ సుల్లీ (అవతార్ లో కథానాయకుడి పేరు ఇదే)ని పెద్దవాడిగా బ్రీడ్ చెయ్యడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత పెద్దవాడిగా మారిన జాక్ సుల్లీ ఏ విధంగా ఈ సమాజంలో ఇమడటానికి ప్రయత్నిస్తుంటాడు..పనిలో పనిగా నెయిత్రి(అవతార్ నాయిక)ను కలుస్తాడు. ఆమె ఇతనికి కారు నడపడం లాంటి విషయాలు నేర్పుతుంది. దీంతో జాక్ ఆమె ప్రేమలో పడతాడు. అవతార్ సినిమా పేరడీగా వచ్చిన ఈ వీడియో ఆద్యంతం నవ్విస్తూ సాగుతుంది. వీలుంటే మీరొక లుక్ వేయండి. you tube లో ఈ వీడియో మీకు అందుబాటులో వుంటుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu