అమ్మాయి రాకతో ప్యాలెస్ మొత్తం 'పింక్ కలర్'
డేవిడ్ బెకహాం ప్రపంచపు పుట్ బాల్‌ని ఒకఊపు ఊపుని ఆటగాడు. ఇటీవలే తన భార్య విక్టోరియా బెకహాం ఓ పాపాయికి జన్మనివ్వడం జరిగింది. అంతక ముందు విక్టోరియా, డేవిడ్ బెకహాం జంటకు ముగ్గురు మగపిల్లలు పుట్టారు. ముగ్గురి తర్వాత పుట్టిన పుట్టిన ఆ అమ్మాయికి డేవిడ్ బెకహాం జంట 'హార్పర్ సెవెన్' అనే పేరుని పెట్టడం జరిగింది. డేవిడ్ బెకహాంకి పుట్టిన ఈ అమ్మాయిని చాలా అపురూపంగా చూసుకుంటున్నారు.
విక్టోరియా బెకహాం ఈ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఇద్దరి ఫోటోలను క్షేమంగా ఉన్నారని అభిమానులకు తెలిపేందుకు గాను డేవిడ్ బెకహాం సామాజిక వెబ్ సైట్ అయిన ఫేస్‌బుక్, మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ అయిన ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం జరిగింది. కేవలం హార్పర్ సెవెన్ పుట్టి 12 వారాలు కాక మందు తన కుటుంబంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయని డేవిడ్ బెకహాం అన్నారు.
హార్పర్ సెవెన్ కోసం ప్రత్యేకంగా తన ప్యాలెస్ మొత్తానికి 'పింక్ కలర్' వేయించినట్లు డేవిడ్ బెకహాం తెలిపారు. తన ముగ్గురు కుమారులు(బ్రూక్లెన్(12), రోమియో(9), క్రూజ్(6))లు కూడా వారికి చెల్లెలు పుట్టడంతో ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపాడు. ప్రస్తుతం పింక్ ప్యాలెస్‌లో ఉంటున్న హార్పర్ కొసం డేవిడ్ బెకహాం దంపతులు హార్పర్ ధరించేటటువంటి దుస్తులు, బూట్లు, సాక్సులు అన్నింటిని కొన్ని గదులకు దాచి ఉంచినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











