»   » సింగిల్ గా ఉన్నా సుఖానికేం లోటులేదంటున్న స్టార్ హీరోయిన్

సింగిల్ గా ఉన్నా సుఖానికేం లోటులేదంటున్న స్టార్ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

టైటానిక్ ఫేమ్ కేట్ విన్స్ లెట్ రీసెంట్ గా తన భర్త ఫిల్మ్ మేకర్ అయిన శామ్ మెండాస్ నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోంది. అయితే తాను విడిపోయినందుకు భాధ ఏమి పడటం లేదని చాలా హ్యాపీగా ఉన్నానంటోంది. మీడియాతో మాట్లాడుతూ..ఒంటిరిగా ఉండటం అనేది అనుభవిస్తేనే తెలిసే విషయం.నా జీవితంలో ఇన్నాళ్ళకు అది అనుభవంలోకి వచ్చింది.ఎందుకంటే నేను పుట్టింది, పెరిగింది పెద్ద కుటుంబంలో..నా చుట్టు ఎప్పుడూ జనం ఉండేవారు.దాంతో నాకు ఒంటిరిగా ఉండటం అనేది అస్సలు తెలియదు. అయితే నాకు ఇలా జీవితంలో గ్యాప్ రావటం చాలా విషయాలు తెలుసుకునేందుకు తోర్పడుతోంది. ఒంటిరితనంతో నా గురించి నేను ఆలోచించుకునేందుకు అవకాశం ఏర్పడింది. నన్ను నేను పూర్తిగా తెలుసుకుని తిరిగి ఆవిష్కరించుకునేందుకు సరపడ టైమ్ దొరుకుతోంది. అందుకే ఇక నుంచి నాకు నేనుగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఏడేళ్ళ సంసారం తర్వాత విడిపోయిన కేట్ కి తిరిగి ఇప్పుడిప్పుడే వివాహం గురించి ఆలోచించాలని లేదంటోంది. అయినా ఒంటిరిగా ఉన్నా నేను నా ఆలోచనలతో బిజీగా ఉండదలుచుకున్నాను అని తేల్చేసింది.

English summary
Kate Winslet has spoken for the first time about her split from Sam Mendes, calling her single status “empowering” and insisting she is not “lonely”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X