»   » ఈసారి 'బ్యాట్‌మ్యాన్‌' ఆ హీరోనే...ఫ్యాన్స్ హ్యాపీ

ఈసారి 'బ్యాట్‌మ్యాన్‌' ఆ హీరోనే...ఫ్యాన్స్ హ్యాపీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్ : 'బ్యాట్‌మాన్‌' గా ఎవరు చేస్తున్నారనదే ఎప్పుడూ సినీ ప్రియులకు ఆసక్తికరమైన ఆంశమే. అలాంటిదే మళ్లీ బెన్‌ యాఫ్లెక్‌ ప్రేక్షకులకు దర్శనం ఇచ్చే అవకాశం ఉందనే అంటున్నారు హాలీవుడ్‌ పరిశీలకులు. దాంతో బెన్ అభిమానులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నారు. పూర్తి వివరాలు క్రింద స్టోరీలో చదవండి...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

'బ్యాట్‌మ్యాన్‌'గా మళ్లీ బెన్‌ను చూపించాలని 'బ్యాట్‌మ్యాన్‌' రచయిత జియోఫ్‌ జోన్స్‌ చాలా తహతహలాడుతున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా, బెన్‌ కోసమే అన్నట్లు వార్నర్‌ మూవీస్‌ వాళ్లు సిద్ధం చేసిన 'బ్యాట్‌మ్యాన్‌ వెర్సస్‌ సూపర్‌మ్యాన్‌: డాన్‌ ఆఫ్‌ జస్టిస్‌' చిత్రం ట్రయిలర్‌ విడుదల అయి, బాగా సందడి చేస్తోంది.

Ben Affleck in a standalone 'Batman' movie is on the fast-track

ఈ చిత్రం 'గాడ్‌ వర్సెస్‌ మ్యాన్‌ అండ్‌ డే వర్సెస్‌ నైట్‌' అని ప్రచారం చేస్తున్నారు. అంటే, మంచికీ చెడుకీ మధ్య, వెలుతురికీ చీకటికీ మధ్య పోరాటం అన్నది స్పష్టం. ఇక రచయిత జియోఫ్‌ జోన్స్‌ అయితే, కొత్తగా 'జస్టిస్‌ లీగ్‌' అనే ఓ కథనూ బెన్‌ సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు. అంటే, మనకు బెన్‌ మళ్లీ త్వరలోనే 'బ్యాట్‌మ్యాన్‌'గా కనిపిస్తాడన్నమాట!

బెన్ ప్రస్తుతం....

బెన్ ఆప్లిక్... 'లివ్‌ బై నైట్‌' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గతంలో ఎప్పుడో అమెరికాలో మద్యపానం నిషేధంలో ఉన్నప్పుడు జరిగిన ఒక క్రైమ్‌ను దృష్టిలో ఉంచుకుని డెన్నిస్‌ డెన్నిస్‌ లెహామ్‌ (అవును, ఇతని పేరులో రెండు సార్లు 'డెన్నిస్‌ డెన్నిస్‌' అని వస్తుంది!) రాసిన ఒక నవల ఆధారంగా నిర్మితం అవుతోంది. 'లివ్‌ బై నైట్‌' చిత్రానికి కథ.

English summary
Though the Deadline story indicates that Affleck and Johns plan to have the script done by the end of the summer, it may be awhile before we see a solo Affleck as Batman.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu