Jennifer Lopez పై అభిమాని దారుణంగా.. ప్రియుడు ఏం చేశాడంటే?
హాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు బెన్ అఫ్లెక్, జెన్నిఫర్ లోపేజ్ మధ్య ప్రేమాయణం మళ్లీ చిగురించి జోరుగా సహజీవనం చేస్తున్న విషయం అభిమానుల్లో జోష్‌ను పెంచింది. ఇటీవల కాలంలో వాళ్లిద్దరూ విహారయాత్రలు చేస్తూ రొమాంటిక్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇటీవల వారిద్దరూ కలిసి వెళ్తుండగా జెన్నీఫర్ లోపేజ్‌తో ఓ అభిమాని కాస్త దురుసుగా వ్యవహరించడంతో బెన్ అఫ్లెక్ ఘాటుగా స్పందించారు. ఆ విషయం ఇప్పుడు ప్రపంచ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
బెన్ అఫ్లెక్, జెన్నిఫర్ లోపేజ్ రిలేషన్‌షిప్ విషయానికి వస్తే.. ఈ ఇద్దరు అగ్రతారలిద్దరూ గిగ్లీ అనే సినిమా షూటింగు సమయంలో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. నాలుగేళ్ల డేటింగ్ తర్వాత సెప్టెంబర్ 2003లో నిశ్చితార్థం చేసుకొన్నారు. ఆ తర్వాత నవంబర్ 2003లో పెళ్లి చేసుకొన్నారు. ఏడాది గడవకముందే జనవరి 2004లో విడిపోయారు. అయితే కొద్ది రోజుల క్రితం అలెక్స్ రోడ్రిగ్స్‌తో విడిపోయిన తర్వాత జెన్నిఫర్ మళ్లీ బెన్ అఫ్లెక్‌తో కలిశారు.

ఇదిలా ఉండగా, వెనీస్ నగరంలో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్‌కు బెన్ అఫ్లెక్, జెన్నీఫర్ లోపేజ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ది లాస్ట్ డ్యూయల్ అనే సినిమా ప్రీమియర్‌ను వీక్షించారు. ఈ సినిమా ప్రీమియర్ సందర్భంగా వారిద్దరి రెడ్ కార్పెట్‌పై నడిచి అభిమానులు ఆకట్టుకొన్నారు. ఫోటోగ్రాఫర్ల కోసం రెడ్ కార్పెట్‌పై ముద్దులు పెట్టుకొని ఫోటోలకు ఫోజిచ్చారు.
అయితే.. బెన్ అఫ్లెక్, జెన్నిఫర్ లోపెజ్ ఇద్దరు శనివారం రోజున వెనీస్ ఎయిర్‌పోర్టులో కలిసి వెళ్తుండగా.. ఓ వ్యక్తి కాస్త దురుసుగా ఫోటో తీసుకోవడానికి ప్రయత్నించాడు. జెన్నీఫర్‌తో దురుసుగా ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని గమనించి బెన్.. ఆ వ్యక్తిని చేతితో దూరంగా నెట్టివేశాడు. దాంతో వారిద్దరు మధ్య వాగ్వాదం చోటుచేసుకొన్నది. బెన్ అఫ్లెక్‌తో ఓ వ్యక్తి గొడవ పడుతున్నారని గ్రహించిన సెక్యూరిటీ సిబ్బంది జోక్యం చేసుకొని వారిని విడదీశారు. ఈ సందర్భంగా జెన్నిఫర్ లోపేజ్ భయంతో బెన్ వెనుక దాక్కోవడానికి ప్రయత్నించింది.


Click it and Unblock the Notifications











