»   » లీకైంది..వెంటనే కంగారుగా టీజర్ వదిలారు(వీడియో)

లీకైంది..వెంటనే కంగారుగా టీజర్ వదిలారు(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్‌: నెట్ లో ముందే లీక్ అయిపోవటం...ఆ తర్వాత తేరుకుని నిర్మాణ సంస్ధలు..దాన్ని తొలిగించి, ఒరిజనల్ ని విడుదల చేయటం ఈ మధ్యన సిని ప్రపచంలో కామన్ అయిపోయింది. దానికి హాలీవుడ్ కూడా మినహాయింపేమీ కాదు. తాజాగా బెన్ స్టెల్లర్ అబిమానులు అంతా ఎదురుచూస్తున్న జూలాండర్ 2 సీక్వెల్ టీజర హఠాత్తుగా శనివారం నెట్ లో దర్శనమిచ్చింది.

రెండు నిముషాలు పాటు సాగే ఆ వీడియో ఆ చిత్ర నిర్మాణ సంస్ద పారామౌంట్ వారిని నిరాశపరిచింది. దాంతో వారు కొద్ది గంటల్లోనే రంగంలోకి దిగి మొత్తం లింక్ లు తొలిగించేసారు. అప్పటికే కొంత డ్యామేజ్ జరిగిందని గ్రహించి..వెంటనే తమ దగ్గర ఉన్న ఒరిజనల్ టీజర్ ని విడుదల చేసేసారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

Ben Stiller is back in the first teaser trailer for Zoolander 2.

ప్రముఖ హాలీవుడ్‌ నటుడు, దర్శకులు బిన్‌ స్టెలర్‌ దర్శకత్వం వహించిన 'జూలాండర్‌' (2001) చిత్రానికి సీక్వెల్‌ 'జూలాండర్‌-2' నిర్మిస్తున్నారు. ఈ హాస్య ప్రధాన చిత్రాన్ని 2016 విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ పారమౌంట్‌ పిక్చర్స్‌ వెల్లడించింది. ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఆ టీజర్ ని మీరు ఇక్కడ చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక బెన్‌ స్టిల్ల్లర్‌ రూపొందించబోతున్న ఫ్యాషన్‌ కామెడీ ఫిల్మ్‌ ఈ ‘జూలాండర్‌' సీక్వెల్‌లో ప్రధాన పాత్రను ఆస్కార్‌ విజేత పెనెలోప్‌ క్రజ్‌ చేయబోతోంది. చాలా కాలం నుంచీ ప్లానింగ్‌లో ఉన్న ఈ సినిమాకు ఆమె రాక మంచి బలాన్నిచ్చిందని చెప్పాలి.

దర్శకత్వం వహించడంతో పాటు హీరో పాత్రనూ స్టిల్లర్‌ చేయనున్నాడు. 2001లో వచ్చిన మొదటి ‘జూలాండర్‌'లోనూ సూపర్‌ మోడల్‌ డెరెక్టర్ జూలాండర్‌గా ఆయనే చేశాడు. అందరినీ అలరించాడు.

Ben Stiller is back in the first teaser trailer for Zoolander 2.

విలన్‌గా ఓవెన్‌ విల్సన్‌ నటించనుండగా, ఫ్యాషన్‌ డిజైనర్‌గా మరో కీలక పాత్రను విల్‌ ఫెర్రల్‌ చేయనున్నాడు. ఒరిజినల్‌లో స్టిల్లర్‌ భార్య అయిన జర్నలిస్ట్‌ మెటిల్డా జెఫ్రీస్‌గా క్రిస్టీన్‌ టేలర్‌ చేసింది. సీక్వెల్‌లో పెనెలోప్‌ చేయబోతోంది ఆ పాత్రనా, కాదా అనే విషయం స్పష్టం కాలేదు.


English summary
Fans of Ben Stiller and his upcoming comedy sequel, Zoolander 2, were excited and then disappointed on Saturday after a teaser trailer leaked online. While the two-minute video was available for a few hours on YouTube, Paramount Pictures soon pulled it.It was not gone for long though - on Sunday morning, an official version of the Zoolander 2 teaser was back on the Internet.
Please Wait while comments are loading...