»   » ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల్లో సత్తాచాటిన మహిళలు..!!

ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల్లో సత్తాచాటిన మహిళలు..!!

Subscribe to Filmibeat Telugu

సంగీత ప్రపంచం యావత్తూ ఎంతో ఆశక్తిగా ఎదురుచూసిన 52వ ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం జనవరి 31వ తేదీ, ఆదివారం నాడు లాస్ ఏంజిల్స్ లో ఘనంగా జరిగింది. ఈ అవార్డుల్లో మహిళలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ప్రముఖ పాప్ తారలు బేవన్స్, లేడీ గాగా, టేలర్ స్విఫ్ట్ లు ఈ అవార్డుల్లో తమ సత్తాచాటారు. పది గ్రామీ అవార్డులకు నామినేట్ అయిన బేవన్స్ అందులో నాలుగు విభాగాల్లో అవార్డులను నిలబెట్టుకుంది. టేలర్ స్విఫ్ట్, లేడీ గాగాలు చెరో రెండు అవార్డులు గెలుచుకొన్నారు.

ఇటీవలి కాలంలో పాప్ ప్రపంచంలో తన హవాను చాటుతున్న టేలర్ స్విఫ్ట్ 'వైట్ హార్స్' పాటకు గాను ఉత్తమ దేశయగీతం (బెస్ట్ కంట్రీ అవార్డు)అవార్డును, ఉత్తమ గాయనిగా మరో అవార్డును గెలుచుకుంది. భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన ఎఆర్ రెహమాన్ 'జయహో' పాటకు గాను రెండు అవార్డులను గెలుచుకున్నాడు. ఇక పాప్ ప్రపంచాన్ని ఏలిన దివంగత పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ కు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును ప్రకటించారు. ఈ అవార్డుని ఆయన పిల్లలు ప్యారిస్ జాక్సన్, ప్రిన్స్ మైఖేల్ జాక్సన్ అందుకున్నారు. మొత్తానికి ఈ ఏటి గ్రామీ అవార్డుల్లో మహిళలు తమ సత్తా చాటారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu