»   » చైనాలో విడుదలతో వేల కోట్లు వసూలు చేస్తోంది... టోటల్ కలెక్షన్ 6.5 వేల కోట్లు!

చైనాలో విడుదలతో వేల కోట్లు వసూలు చేస్తోంది... టోటల్ కలెక్షన్ 6.5 వేల కోట్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రపంచ ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ నిర్మించిన 'బ్లాక్ పాంథర్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1 బిలియన్ డాలర్లు (రూ. 6,500 కోట్లు) వసూలు చేసింది. ఈ చిత్రాన్ని చైనాలో రిలీజ్ చేసిన తర్వాత అక్కడ కలెక్షన్లు అదరగొట్టడంతో ఈ మూవీ 1 బిలియన్ మార్కును అందుకుంది.

బ్లాక్ పాంథర్

బ్లాక్ పాంథర్

‘బ్లాక్ పాంథర్' చిత్రాన్ని చైనాలో భారీ ఎత్తున రిలీజ్ చేశారు. వరల్డ్ సినిమాకు యూఎస్ఏ తర్వాత చైనా అతిపెద్ద మార్కెట్. ఇంతకు ముందు ఇక్కడ విడుదలైన పలు హాలీవుడ్ చిత్రాలు చైనాలో భారీ వసూళ్లు సాధించాయి.

యూఎస్ఏలో భారీగా

యూఎస్ఏలో భారీగా

‘బ్లాక్ పాంథర్' చిత్రం ఒక యూఎస్ఏలోనే $521 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ వీకెడ్ నాటికి ఇంర్నేషనల్ సేల్స్ $500 దాటుతుందని డిస్నీ సంస్థ ఒక ఈమెయిల్ ద్వారా తెలిపింది. ఈ చిత్రం ఓవరాల్‌గా ఎంత వసూలు చేస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

దాన్ని కొట్టే సినిమా రాలేదు

దాన్ని కొట్టే సినిమా రాలేదు

ప్రపంచ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు అవతార్ చిత్రం నెం.1 స్థానంలో ఉంది. 2.787 బిలియన్ డాలర్ల వసూళ్లూ సాధించింది. దీన్ని కొట్టే సినిమా ఇంతవరకురాలేదు.

టైటానిక్ ఇప్పటికీ

టైటానిక్ ఇప్పటికీ

2 బిలియన్లకు పైగా వసూలు చేసి టైటానిక్, స్టార్స్ వార్స్ దీని తర్వాత స్థానంలో ఉన్నాయి. చాలా సంవత్సరాల క్రితం విడుదలైన టైటానిక్ ఇప్పటికీ వసూళ్ల పరంగా టాప్ ప్లేసులో ఉండటం గమనార్హం.

English summary
Walt Disney Co.’s Black Panther has collected more than $1 billion (Rs 6,500 crore) at cinemas worldwide, making it the company’s 16th movie to reach that milestone.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu