»   » టైటానిక్ రికార్డులు బ్రేక్.. చరిత్ర సృష్టించిన బ్లాక్ పాంథర్!

టైటానిక్ రికార్డులు బ్రేక్.. చరిత్ర సృష్టించిన బ్లాక్ పాంథర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ డిస్నీ, మార్వెల్ స్టూడియో సంయుక్తంగా నిర్మించిన బ్లాక్ పాంథర్ చిత్రం కలెక్షన్లపరంగా చరిత్రను సృష్టిస్తున్నది. చాడ్విక్ బోస్‌మ్యాన్ నటించిన ఈ చిత్రం ఉత్తర అమెరికాలో రికార్డులు తిరగరాస్తున్నది. గతంలో టైటానిక్ క్రియేట్ చేసిన రికార్డును అధిగమించింది. స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్, అవతార్ చిత్రాల తర్వాత మూడో స్థానంలో నిలిచింది.

1.3 బిలియన్ డాలర్లు

1.3 బిలియన్ డాలర్లు

బ్లాక్ పాంథర్ చిత్రం హాలీవుడ్ సినీ సాంస్కృతిక అడ్డంకులను అధిగమించింది. బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తున్నది. ఫిబ్రవరిలో రిలీజైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్ డాలర్లను వసూలు చేసింది.

ఉత్తర అమెరికాలో రికార్డు కలెక్షన్లు

ఉత్తర అమెరికాలో రికార్డు కలెక్షన్లు

ఉత్తర అమెరికాలో ఈ చిత్రం 659.3 డాలర్లను వసూలు చేసింది. గతంలో స్టార్ వార్స్ చిత్రం 936.7 మిలియన్ డాలర్లు, వసూలు చేయగా, అవతార్ చిత్రం 760.5 మిలియన్ డాలర్లు వసూలు చేశాయి. ఈ రెండు చిత్రాల వసూళ్ల తర్వాత బ్లాక్ పాంథర్ నిలువడం గమనార్హం అని నిర్మాతలు తెలిపారు.

ర్యాన్ కూగ్లర్ రూపొందించిన ..

ర్యాన్ కూగ్లర్ రూపొందించిన ..

మార్వెల్ స్టూడియో బ్యానర్‌లో ఓ ఆఫ్రికన్ అమెరికన్ దర్శకుడు చిత్రాన్ని రూపొందించడం ఇదే తొలిసారి. ర్యాన్ కూగ్లర్ రూపొందించిన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొన్నది. కేవలం 26 రోజుల్లోనే 1 బిలియన్ అమెరికన్ డాలర్లను వసూలు చేసింది.

ఏ క్వయిట్ ప్లేస్ హంగామా

ఏ క్వయిట్ ప్లేస్ హంగామా

ఇదిలా ఉండగా, మరో హారర్ చిత్రం ఏ క్వయిట్ ప్లేస్ హాలీవుడ్‌లో సందడి చేస్తున్నది. ఈ చిత్రానికి మంచి రివ్యూలు రావడంతో కలెక్షన్లపరంగా దూసుకెళ్తున్నది. అంతేకాకుండా మంచి మార్కెటింగ్ స్ట్రాటెజీ కూడా తోడవ్వడంతో ఉత్తర అమెరికాలో 60 మిలియన్ డాలర్లను వసూలు చేసింది.

English summary
Marvel's superhero blockbuster 'Black Panther' has sailed past 'Titanic' to become the third-highest grossing US theatrical release of all time. With a domestic total of $659.3 million, the Ryan Coogler-directorial is behind 'Star Wars: The Force Awakens' ($936.7 million) and 'Avatar' ($760.5 million).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X