»   » ఏంజలీనా జోలీ-బ్రాడ్ పిట్ విడాకుల విలువ 2500 కోట్లు?

ఏంజలీనా జోలీ-బ్రాడ్ పిట్ విడాకుల విలువ 2500 కోట్లు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హాలీవుడ్ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చే తారల్లో ఏంజలీనా జోలీ, బ్రాడ్ పిట్. దాదాపు 11 సంవత్సరాలుగా వీరు రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నారు. రెండళ్ల క్రితమే వీరు వివాహం కూడా చేసుకన్న సంగతి తెలిసిందే. వీరికి ఆరుగురు సంతానం కూడా.

గత పదకొండేళ్లుగా ఎంతో అన్యోన్యంగా జీవనం సాగిస్తున్న ఈ ఇద్దరూ....ఆదర్శ ప్రేమికులుగా, ఆదర్శ దంపతులుగా కీర్తిగడించారు. వీరి మధ్య ప్రేమానురాగాలు చూసి చాలా మంది వీరు ఎప్పటికీ విడాకుల జోలికి పోరు అని భావించే వారు. అయితే అందుకు వీరేమీ అతీతులు కాదని తేలిపోయింది.

త్వరలో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు హాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. వీరి విడాకులకు బ్రాడ్ పిట్ మరొక నటితో ఎఫైర్ పెట్టుకోవడం ఒక కారణమైతే, ఏంజలీనా జోలీ అనారోగ్యం కూడా మరోకారణమని అంటున్నారు.

Brad Pitt and Angelina Jolie heading for $400 Million divorce?

ఏంజలీనా జోలీ కొంత కాలంగా వివిధ ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. క్యాన్సర్ బారిన పడ్డ ఆమె వక్షోజాలు కూడా వైద్యులు తొలగించారు. అప్పటి నుండి ఆమెను వివిధ అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని తెలుస్తోంది.

జోలీ అనారోగ్యం కారణంగా..... బ్రాడ్ పిట్ తన సహచర నటి మారియన్ కు దగ్గరయ్యాడని, ఆమెతో కలిసి శృంగార కార్యకలాపాలు జరుపుతున్నాడని ప్రచారం జరుగుతోంది. వీరి ఎఫైర్ పై ఏంజలీనా జోలీ చాలా కోపంగా ఉందని, బ్రాడ్ పిట్ తనను చీట్ చేసాడనే భావనకు వచ్చిన ఆమె విడాకులకు సిద్దమైనట్లు సమాచారం. వీరి విడాకుల విలువ 400 మిలియన్ డాలర్లు... మన కరెన్సీలో రూ. 2500 కోట్లకుపైగా ఉంటుందని హాలీవుడ్లో హాట్ హాట్ గా చర్చజరుగుతోంది.

English summary
Hollywood star Brad Pitt and wife of 2 years Angelina Jolie, are reportedly heading for a multi-million dollar divorce. The pair, are allegedly ending their 11-year relationship because of Pitt’s relationship with his ‘Allied’ co-star, Marion Cotillard and Jolie's ill health. Reports on OK! Magazine state that Brad and Angie are headed for a $400 million split. Insiders have opened up to the magazine claiming that Jolie’s deteriorating health and Brad’s closeness with his co-star are the main causes leading to the divorce.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu