హాలీవుడ్ తారలు బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలి తమ దాంపత్య జీవితానికి వీడ్కోలు చెప్పడం అభిమానులను షాక్ గురిచేసిన విషయం తెలిసిందే. 2016లో వారిద్దరూ కోర్టు ద్వారా విడాకులు తీసుకొన్నారు. అప్పటి నుంచి వారిద్దరూ కలుసుకొన్న దాఖలాలు లేవు. అయితే తాజాగా ఎంజెలీనా, బ్రాడ్ పిట్ కలుసుకోవడం మీడియా పతాక శీర్షికలను ఆకర్షించింది. అయితే వారు కలుసుకొన్న ఘటనపై పలు రకాల భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. వారిద్దరూ కలుసుకొన్న విషయంపై ఆంగ్ల మీడియా ఎలా స్పందించిందంటే.
పిల్లల సంరక్షణ కోసమే
ఎంజెలీనా జోలి, బ్రాడ్ పిట్ పర్సనల్‌గా కలుసుకోవడం ఇదే మొదటిసారి కాదు. అయితే వారిద్దరూ తమ పిల్లల సంరక్షణ బాధ్యతల గురించి చర్చించుకోవడానికి భేటీ అయ్యారు. వారి మధ్య ఎలాంటి ద్వేష భావాలు లేవు. ఒకరికొకరు ఆప్యాయంగా పలుకరించుకొన్నారు అని హాలీవుడ్‌కు చెందిన వెబ్‌సైట్ పేర్కొన్నది.
ఎంజెలినా, బ్రాడ్ పిట్ మధ్య అవగాహన
పిల్లల సంరక్షణ గురించి ఎంజెలినా, బ్రాడ్ పిట్ మధ్య అవగాహన ఏర్పడింది. ఎన్ని గంటలు బ్రాడ్ పిట్ పిల్లలతో గడపాలి? అనే విషయంపై స్పష్టత వచ్చింది. పిల్లలు ఉభయ సంరక్షణలో ఉండాలని నిర్ణయించుకొన్నారు. ఎంజెలీనాతో సామరస్యంగా ఉంటూనే పిల్లలకు తండ్రిగా వ్యవహరించాలని బ్రాడ్ పిట్ భావిస్తున్నారనే విషయాన్ని కథనంలో వెల్లడించింది.
మీడియా వివాదాస్పద కథనాలతో
ఎంజెలీనా, బ్రాడ్ పిట్ మధ్య దాంపత్య కలహాలపై గతంలో మీడియాలో అనేక వివాదాస్పద కథనాలు వెలువడ్డాయి. పిల్లలపై బ్రాడ్ పిట్ అభ్యంతరకరంగా వ్యవహరించడం, వారిపై భౌతిక దాడులు చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. అందుకే ఎంజెలీనా విడాకులకు దరఖాస్తు చేసుకొన్నదని వార్తలు వెలువడ్డాయి.
పారిశ్రామికవేత్తతో డేటింగ్
బ్రాడ్ పిట్‌తో విడాకులు తీసుకొన్న తర్వాత ఎంజెలీనా బ్రిటన్‌కు చెందిన పారిశ్రామిక వేత్తతో ప్రేమలో పడిందనే రూమర్లు వస్తున్నాయి. అయితే అధికారికంగా ఎంజెలినా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ప్రస్తుతం దోస్ హూ విష్ మీ డెడ్ అనే చిత్రంలో నటిస్తున్నది. మర్డర్ మిస్టరీగా రూపొందే చిత్రం వచ్చే ఏడాది మే నెలలో రిలీజ్ కానున్నది.
Brad Pitt and Angelina Jolie called it quits in 2016. There was much mudslinging over the custody of their children. After what seems like ages, the two met on a couple of occasions to sort out the custody details of their children.
Story first published: Tuesday, February 5, 2019, 17:31 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more