»   » ఏంజెలినా, బ్రాడ్‌పిట్‌లకు మరో ఇద్దరు పిల్లలు

ఏంజెలినా, బ్రాడ్‌పిట్‌లకు మరో ఇద్దరు పిల్లలు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Brad Pitt and Angelina Jolie want more kids
లండన్‌: ఏంజెలినాజోలి, బ్రాడ్‌పిట్‌లకు పిల్లల పెంపకం మీద మమకారం తగ్గలేదు. ఆరుగురు చిన్నారులున్నా కూడా మరో ఇద్దరు పిల్లలు కావాలని ఈ హాలీవుడ్‌ జంట నిర్ణయించుకున్నట్లు బ్రిటన్‌ ఆన్‌లైన్‌ పత్రిక 'సన్‌'లో వచ్చిన ఒక కథనం వెల్లడించింది.

ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో సిరియా కాందిశీకులను కలుస్తున్న 38 ఏళ్ల ఏంజెలినా.. జోర్డాన్‌కు చెందిన ఒక చిన్నారిపాపను దత్తత తీసుకోవాలని భావిస్తున్నట్లు ఆ కథనం పేర్కొంది. సిరియా ప్రజల దుస్థితి చూసి చలించిన జోలి తనవంతు సాయంగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపింది.

ఆ ప్రాంతానికి చెందిన చిన్నారిని దత్తత తీసుకోవటం వల్ల మీడియాలో ప్రచారం జరిగి.. సిరియన్ల పరిస్థితి ప్రపంచానికి తెలుస్తుందని ఆమె భావిస్తున్నట్లు వివరించింది. దీనికి బ్రాడ్‌పిట్‌ కూడా అంగీకరించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు, ఈ జంట ఇంకో చిన్నారికి జన్మనివ్వాలని నిర్ణయించుకున్నారని, ఈ నేపథ్యంలోనే ఏంజెలినా పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటున్నారని ఆ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఏంజెలినా జోలి, బ్రాడ్‌పిట్‌లకు ముగ్గురు పిల్లలున్నారు.

వివిధ దేశాలకు చెందిన మరో ముగ్గురిని దత్తత తీసుకున్నారు. తాజాగా ఇద్దరు చిన్నారులు కలిస్తే వీరి సంతానం సంఖ్య ఎనిమిదవుతుంది. ఇప్పటివరకూ సహచరులుగానే ఉన్న ఏంజెలినా, బ్రాడ్‌పిట్‌ త్వరలో ఫ్రాన్స్‌లో వివాహం చేసుకోనున్నట్లు సమాచారం.

English summary

 Brad Pitt and Angelina Jolie want two more kids. The A-list couple are allegedly hoping to expand their large brood - which includes Maddox, 11, Pax, nine, Zahara, eight, Shiloh, six, and four-year-old twins Knox and Vivienne - by having one more biological child together as well as adopting an orphan from Jordan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu