»   »  బ్రాడ్‌పిట్ కొత్త చిత్రం 'వరల్డ్ వార్ Z' .. విశేషాలు

బ్రాడ్‌పిట్ కొత్త చిత్రం 'వరల్డ్ వార్ Z' .. విశేషాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu
లాస్ ఏంజిల్స్ : బ్రాడ్‌పిట్ హీరోగా రూపుదిద్దుకున్న హాలీవుడ్ యాక్షన్ మూవీ 'వరల్డ్ వార్ Z' ఈ నెల 21న విడుదలవుతోంది. 'మాక్స్ బ్రూక్ రాసిన 'వరల్డ్ వార్' నవల ఆధారంగా రూపుదిద్దుకున్న భారీ యాక్షన్ చిత్రమిది. ఈ చిత్రం కోసం బ్రాడ్ పిట్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రకథ ఏమిటంటే.. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన జెర్రీ లేన్ తన భార్య, ఇద్దరు పిల్లలతో గడుపుతుంటాడ. ఇలాంటి తరుణంలో ప్రపంచ దేశ ప్రభుత్వాలని, సైనికుల్ని ' జామ్‌బి' అనే వైరస్ పీడిస్తుంటుంది. దాని బారి నుంచి ప్రపంచాన్ని కాపాడటానికి జెర్నీ తన కుటుంబాన్ని వదిలి ప్రపంచ యాత్రకి బయలుదేరతాడు. ఆ వైరస్ బారి నుంచి ప్రపంచాన్ని అతనెలా రక్షించాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది.

ఈ నెల రెండున లండన్‌లో జరిగిన ప్రీమియర్‌లో ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆక ట్టుకొంది. ఆంగ్ల చిత్రాలను అభిమానించే ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా నచ్చే అవకాసం ఉంది. మార్క్ ఫోర్‌సైర్ ఈ చిత్రానికి దర్శకుడు. మన రాష్ట్రంలో కె.ఎఫ్.సి. ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ సినిమాని విడుదల చేస్తోంది.

English summary
Brad Pitt doesn't make too many big films these days, so when he releases one, it's a fairly huge deal. Emphasis on huge. None more apocalyptic than World War Z, the zombie thriller that hurls into theaters June 21. Pitt premiered the film in Manhattan on Monday, in Times Square, and signed autographs for the appreciative crowd congregated in the heat, waiting for him. Color Pitt impressed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu