»   » ప్రియురాలికి ప్రియుడు ఇచ్చిన మాన్సన్ ఖరీదు 40మిలియన్ డాలర్లు..!

ప్రియురాలికి ప్రియుడు ఇచ్చిన మాన్సన్ ఖరీదు 40మిలియన్ డాలర్లు..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లండన్: సాల్ట్' హిరోయిన్ 'ఏంజలీనా జోలీ' ఆమె ప్రియుడు బ్రాడ్ పిట్ ఏమి చేసినా అది సంచలనమే. వీరిద్దరూ ఐదు సంవత్సాల నుండి కలసి జీవనం సాగిస్తున్నారు. బ్రాడ్ పిట్ తన భార్య అయిన జెన్నిఫర్ ఆనిస్టన్ విడాకులు యిచ్చి ఏంజలీనా జోలీతో సహజీనం సాగిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి గుడ్ విల్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ప్రపంచంలోని అనేక నిరాశ్రయులకు చేయూతను అందిస్తున్న ఏంజలీనా జోలీ ఇటీవల కాలంలో పాకిస్తాన్ లో భూకంపాలు, వరదలు సంభవించడం అందరికి తెలిసిందే. ఆ వరదలలో బాగా నష్టపోయిన వారి కోసం ఏంజలీనా జోలీ తనదైన శైలిలో ఒక వీడియో రూపోందించి వారికి సహాయం అందించవలసిందిగా కోరడం జరిగినది. అందుకు గాను 'ఏంజలీనా జోలీ' తన వంతు గా 100,000 డాలర్స్ ని ఇవ్వడం జరిగినది. ఇలా ఎన్నో సార్లు ఈ అందమైన జంట వారికి చేతనైన సహాయం అందజేసి వాళ్శ అభిమానాన్ని చాటుకున్నారు.

ఎప్పుడూ ఇలాంటి సేవా కార్యక్రమాలే కాకుండా అప్పుడప్పుడు కొంత సమయం తన కుటుంబానికి కూడా కేటాయిస్తుంది. ఇటివల ది టూరిస్ట్ అనే సినిమాకిగాను ఏంజలీనా జోలీ ఇటలీ వెల్లడం జరిగినది. ఇటలీ అందాలకు ముగ్దురాలైన ఏంజలీనా జోలీ అక్కడ ఒక ఇంటిని సోంతం చేసుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆమె ప్రియుడు బ్రాడ్ పిట్ ఆమెకోసం 40 మిలియన్ డాలర్లు పెట్టి కోనడం జరిగినది. దీనిని కోనడం వల్ల ఏంజలీనా జోలీ మూడవ ఇంటికి యజమానురాలైంది. మొన్న లాస్ ఏంజెల్స్ లో లగ్జరియస్ మాన్సన్ ను 3.5మిలియన్లు పెట్టి కోనడం జరిగింది. ప్రస్తుతం కోన్న ఇటాలియన్ లగ్జరియస్ మాన్సన్ 18,000 స్కేర్ ఫీట్ తో 15 బాత్ రూమ్స్, 7 బాత్స్, ఒక మూవీ ధియేటర్, రెండు స్విమ్మింగ్ పూల్స్, ఒక జిమ్ ఉన్నాయని వారు వెల్లడించారు. ఐతే ఈ లగ్జరియస్ మాన్సన్ ను సెలవుల్లో రిలాక్స్ అవ్వడానికి మాత్రమే ఉపయోగిస్తామని, మా మొట్టమొదటి మాన్సన్ అయినటువంటి లాజ్ ఫెలిజ్ లో ఉంటామని వెల్లడించారు. ఇటలీలో ప్రస్తుతం వీరు కోన్నటువంటి లగ్జరియస్ మాన్సన్ నార్త్ ఇటాలియన్ హిల్స్ లో ఉంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu