»   » ఆరు సంవత్సరాలు కలసి జీవించిన తర్వాత పెళ్లికి సిద్దమైన సూపర్ స్టార్

ఆరు సంవత్సరాలు కలసి జీవించిన తర్వాత పెళ్లికి సిద్దమైన సూపర్ స్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్‌లో బ్రాడ్‌పిట్, ఏంజిలీనాజోలీ జంట ఎంతో ప్రత్యేకం. మాజీ భార్య జెన్నిఫర్ ఆనిస్టన్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత అప్పటి నుండి బ్రాడ్‌పిట్, ఏంజిలీనాజోలీ ఇద్దరూ కలసి ఉంటున్న విషయం తెలిసిందే. ఐతే ఇటీవల కాలంలో వీరిద్దరూ చాటుగా పెళ్శి చేసుకున్నారంటూ చాలా రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రూమర్‌ని వారు నిజం చేయాలని అనుకుంటున్నారు. అందుకు కారణం వీరి పిల్లలే. వివరాలలోకి వెళితే హాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ జంటగా పేరున్న వీరిద్దరూ వీరి పిల్లల కొరిక మేరకు పెళ్శి చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఆరు సంవత్సరాల నుండి కలిసి ఉంటున్న వీరిద్దరికి ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఫ్రాన్స్‌లో త్వరలో వీరి పెళ్శి జరగనుందని సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా ఈ జంటే వెల్లడిస్తారని ప్రముఖ అమెరికా పత్రిక వెల్లడించింది. 2000వ సంవత్సరంలో బ్రాడ్‌పిట్ తన మాజీ భార్య జెన్నిఫర్ ఆనిస్టన్‌ని చేసుకున్నప్పుడు పెళ్శి ఖర్చులు మొత్తం సుమారుగా 600,000 పౌండ్స్ వరకు అయింది. ఐతే ఇప్పుడు దీనికంటే ఇంకా ఎక్కవగా వీరిద్దరి పెళ్శి ఇంకా ఘనంగా చేసుకోవాలని అనుకున్నట్లు సమాచారం.

ఓ యుఎస్ వీక్లీ మ్యాగజైన్ వీరిద్దరి పెళ్శి జరగే ప్లేసుని కూడా ప్రచురించడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఏంజిలీనాజోలీ పెళ్శి గౌను ధరించగా ఆమెను తన బ్రదర్ జేమ్స్ హెవెన్ స్వయంగా పెళ్శి మండపం వద్దకు తీసుకోని వస్తాడని ప్రచురించడం జరిగింది. ఇక వీరి పెళ్శికి ఆరుగురు పిల్లలు హాజరవుతారని ప్రచురించారు.

English summary
According to the reports in the U.S, after spending six years together and having six children, the couple is said to be planning an ‘intimate and informal’ wedding in the South of France.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu