»   »  విలువ తెలుసు కాబట్టే పెద్దమొత్తం ఇచ్చామంటున్న సూపర్ స్టార్

విలువ తెలుసు కాబట్టే పెద్దమొత్తం ఇచ్చామంటున్న సూపర్ స్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ స్వీట్ కపుల్ ఏంజిలినా జోలి మరియు బ్రాడ్ పిట్. గతంలో ఎన్నో సార్లు వాళ్శ సహాయసహాకారాలు యావత్ ప్రపంచం మొత్తం అందించారు. అంతేకాకుండా ఐక్యరాజ్యసమితి బ్రాండ్ అంబాసిడర్ గాఉండడం వల్ల ఏంజిలీనా జోలి మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ భూకంప భాదితులకు మరియు బోస్నియా యుద్దంలో నష్టపోయిన వారికి తనదైన శైలిల్ విరాళాలు సేకరించడం వారి అభ్యున్నతికి తోడ్పడం లాంటివి చాలా చేశారు.

అంతేకాకుండా ఏంజిలీనా జోలి మరియు బ్రాడ్ పిట్ స్ధాపించినటువంటి జోలి-పిట్ ఫౌండేషన్ నుంచి నేషనల్ ఎడాప్సన్ డే కుగాను 150,000 డాలర్లు విరాళంగా ఇచ్చారు. ఈసంధర్బంగా ఏంజిలీనా జోలి మరిరయు బ్రాడ్ పిట్ మాట్లాడుతూ ఈమొత్తాన్ని ఎవరైతే తల్లిదండ్రులను కోల్పోయి అనాధులుగా బతుకుతున్నారో వారికోసం ఉపయోగించాలని అన్నారు. యుయస్ లోని యస్ ఓ యస్ చిల్డ్రన్స్ విలేజస్ లోఉన్న చిన్న పిల్లల కోసం మరియు వారి యొక్క ఆలనా పాలనా చూడడం కోసం ఈడబ్బు ఉపయోగపడుతుందని అనుకుంటున్నానని అన్నారు.

ఈసంధర్బంలో అక్కడకి వచ్చినటువంటి ఫాక్స్ న్యూస్ సిఇవో పాలో మాట్లాడుతూ ఏంజిలీనా జోలి మరియు బ్రాడ్ పిట్ సేవలు అభినందనీయం అంటూ కోనియాడారు. ఏంజిలీనా జోలి మరియు బ్రాడ్ పిట్ లకు ఫ్యామిలీ యొక్క విలువ తెలుసుకాబట్టే పిల్లల కోసం వాళ్ల వంతు కృషి చేస్తున్నారన్నారు. చివరగా మాట్లాడుతూ ఫ్యామిలీ ఏర్పాడాలంటే పిల్లలు ముఖ్యమని అన్నారు. పిల్లలు లేకుంటే అలాంటి కుటుంబం ఆనందాలతో ఉండదని అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu