»   » ఏంజలీనా జోలీ-బ్రాడ్ పిట్ జంట కలిసేవుందోచ్..!!

ఏంజలీనా జోలీ-బ్రాడ్ పిట్ జంట కలిసేవుందోచ్..!!

Subscribe to Filmibeat Telugu

ప్రముఖ హాలీవుడ్ జంట ఏంజలీనా జోలీ, బ్రాడ్ పిట్ లు త్వరలో విడిపోనున్నారనే వార్తలు వెలువడినప్పడి నుండీ ఎందుకు విడిపోతున్నారు...?? అని కొన్ని మీడియాలు కథనాలు ప్రచురిస్తుంటే, మరికొందరు వారిద్దరూ విడిపోవడం లేదని కథనాలు ప్రచురిస్తున్నారు. మీడియానే రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరు బ్రాంజెలీనాలు కలిసే వున్నారని, మరికొందరు విడిపోయారని జనాన్ని ఊదరగొడుతున్నారు.

ఇదే విషయం అడుగుదామంటే వీరిద్దరూ ఈ విషయమై స్పందించడానికి సిద్ధంగా లేరు, కానీ మేమిద్దరం కలిసే వున్నామని చెప్పడానికి ఇటీవలే డైరెక్టర్స్ గిల్డ్ అవార్డుకు కలసి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. కాగా మార్చిలో జరగబోయే ఆస్కార్ అవార్డుల కార్యక్రమానిక తొలుత వెళ్లకూడదని అనుకున్నా, ఆ తర్వాత వచ్చిన వార్తలతో ఇద్దరూ కలసి ఆస్కార్ అవార్డుల్లో సందడి చెయ్యాలనుకొంటున్నట్టు తెలిసింది. ఈ పర్యటనతో పుకార్లు పుట్టించే వారి నోరు కట్టేయాలనుకుంటున్నట్టు ఈ బంట భావిస్తోంది. జోలీ-బ్రాడ్ లు ఆస్కార్ కార్యక్రమానికి రారని బాధ పడుతున్నవారికిదో తియ్యటి వార్తేమరి..!!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu