»   » స్టార్ హీరో కాపురంలో చిచ్చుపెట్టిన మాజీ భార్య..!?

స్టార్ హీరో కాపురంలో చిచ్చుపెట్టిన మాజీ భార్య..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన అందమయిన జంట బ్రాడ్ పిట్, ఏంజలీనా జోలీ విడిపోయారా..?? ఇప్పుడు అంతటా వినిపిస్తున్న వార్తలను వింటుంటే అవుననే అనిపిస్తోంది. గత కొన్నాళ్లుగా వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు వీరిద్దరి సహజీవనం మీద లాన్ హాల్పెరిన్ రాసిన పుస్తకం బ్రాంజెలీనాలో వీరిద్దరూ త్వరలో విడిపోనున్నారని రాసారు. ఇప్పుడొస్తున్న వార్తలయితే వారిద్దరూ విడిపోయారు, వారి ఆస్తిని సమంగా పంచుకోవడానికి వీరిద్దరూ లాయర్ సాయాన్ని కూడా తీసుకుంటున్నారు అని వినిపిస్తున్నాయి.

ఇక వీరిద్దరూ తరచుగా గొడవపడుతూవుంటారని, అందులోనూ ముఖ్యంగా బ్రాడ్ పిట్ తాగుడు గురించి, తన మాజీ భార్య అనిస్టాన్ తో స్నేహంగా ఉండటం గురించి జోలీ అతన్ని ఎప్పుడూ నిలదీసేదంట. జోలీ తన మాజీ భర్తలతో స్నేహంగా ఉంటున్నప్పటికీ బ్రాడ్ అనిస్టాన్ తో మాట్లాడటానికి అనుమతించేది కాదట. దీనికి తోడు బ్రాడ్ విపరీతంగా బీర్ తాగుతూవుండటం కూడా వీరిద్దరి మధ్య ఎప్పుడూ గొడవకు దారి తీసేదట.

దీంతో వారిద్దరూ విడిపోవాలనే నిర్ణయానికి వచ్చారట. ఈ నెల మొదటి వారంలోనే వారిద్దరూ విడాకుల పత్రాల మీద సంతకాలు చేసారట. కానీ ఈ విషయం ఇంతవరకూ బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. దీనిపై వారి స్పందనను కోరగా అది మా వ్యక్తిగత విషయం అని దాటవేసారని, బ్రాడ్ ఆమెకు సైక్రియాట్రిస్ట్ ను కలవమని సలహా ఇచ్చాడని, జోలీ అని విషపూరితమైన వ్యక్తిగా అభివర్ణించిందని ఓ వార్తాపత్రిక కథనం. మరి కొందరయితే వారిద్దరూ విడిపోవడాన్ని తేలికగా కొట్టిపారేసారు. లాన్ హాల్పెరిన్ తన పుస్తకం బ్రాంజెలీనా అమ్మకాలను పెంచుకోవడానికి ఈ ఎత్తు వేసాడని అంటున్నారు. నిజానిజాలు తెలియాలంటే వారిద్దరి అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఎదురుచూడాల్సిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu