»   » ఏంజలీనా, బ్రాడ్ పిట్ ల వేర్పాటు నిజమేనా...!!

ఏంజలీనా, బ్రాడ్ పిట్ ల వేర్పాటు నిజమేనా...!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం హాలీవుడ్ లో అందరినోటా వినిపిస్తున్న హాట్ టాపిక్ 'బ్రాంజలీనా' అలియాస్ ఏంజలీనా జోలీ, బ్రాడ్ పిట్ ల వేర్పాటువాదం. ఈ అందమయిన జంట త్వరలో విడిపోనుంది అనే వార్తలు ప్రస్తుతం హాలీవుడ్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాయి. వీరు విడిపోవడానికి రోజుకో కారణం వినిపిస్తోంది. వీరి వేర్పాటుకి జెన్నిఫర్ అనిస్టాన్ కారణమని కొందరు, బ్రాడ్ పిట్ కుటుంబ సభ్యులకు ఏంజలీనా అంటే ఇష్టం లేకపోవడంతో విడిపోతున్నారని మరి కొందరు ఇలా ఎన్నో కారణాలు వినిపిస్తున్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం వీరిద్దరూ ఇప్పట్లో విడిపోయే అవకాశాలు లేవని తెలిసింది.

ఈ నెల ప్రథమార్థంలో ఈ జంట భవిష్యత్తులో తాము విడిపోతే ఆస్తిని, పిల్లలని ఎలా పంచుకోవాలనే విషయమై ఒప్పందపత్రం సంతకం చేసారని తెలిసిందే. కానీ వీరిద్దరూ విడిపోతున్నట్టు వారు లాయర్ కు చెప్పలేదని, భవిష్యత్తును దృష్టిలో వుంచుకొనే ఈ ఒప్పందాన్ని రూపొందించుకున్నారని తెలిసింది. ఈ జంట వడిపోనుందనే వార్తను ఏంజలీనా, బ్రాడ్ దంపతులు, ఏంజలీనా తండ్రి ఖండిచారు. ఇప్పట్లో అలాంటి ఆలోచన లేదని చెప్పారు. ఈ పుకార్లు ఇలా షికారు చేస్తుంటే ఈ జంట మాత్రం రెస్టారెంట్ల చుట్టూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. నిన్న లాస్ ఏంజిల్స్ లోని ఓ రెస్టారెంట్ కు వచ్చినప్పుడు వీరిలా సంతోషంగా కనిపించారు..!!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu