»   » నాకు అందులో అంత అనుభవం లేదు..!

నాకు అందులో అంత అనుభవం లేదు..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అలాస్కాకి 11వ గవర్నర్ సారా పాలిన్. ఇటీవల 2008 ఎన్నికల్లో బారాక్ ఒబామాతో ఉపాధ్యక్ష పదవికి పోటీపడి ఓడిపోయారు. సారా పాలిన్ మరియు టోడ్ ల ముద్దుల కూతురే ఈ బ్రిస్టాల్ పాలిన్. ప్రస్తుతం వాషింగ్టన్ మొత్తం బ్రిస్టాల్ పాలిన్ గురించి మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం ఈ ముద్దుగుమ్మ ఈ సీజన్ డాన్సింగ్ విత్ ద స్టార్స్ లో పోల్గోంటున్నారు. అంతే కాకుండా ఈ సీజన్ డాన్సింగ్ విత్ ద స్టార్స్ లో ఈమె వేసిన డ్రస్సులు అందరిని ఆకర్సించే విధంగా ఉండబోతున్నాయంట.

బ్రిస్టాల్ పాలిన్ మాట్లాడుతూ ఈ షో లో పోల్గోనడం నాకు ఆనందంగా ఉంది. అంతేకాకుండా షో లో ఉన్నంత సేపు కడుపుబ్బా నవ్వుకోవచ్చు. ఈ షో లో మీరు మొట్టమొదటి నుండే గట్టి పోటా పోటిని ఎదుర్కునే స్టార్స్ ని చూడవచ్చు. నాకు మాత్రం డాన్స్ లో అంత అనుభవం లేదు. కాని నాకు డాన్స్ అంటే ప్రాణం అందుకే ఈ షోలో పోల్గోంటున్నాను. నేను అధ్లెటిక్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చాను. నేను వాలీబాల్, బాస్కట్ బాల్, సాకర్ బాగా ఆడతానని అన్నారు. ప్రస్తుతం నేను ఈ షో కోసం లాస్ ఏంజెల్స్ లో ఉంటున్నాను. ఇక్కడ బాగా వేడి, ట్రాఫిక్ కూడా బాగా ఎక్కువగా ఉందని ఆమె వివరించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu