»   » స్టేజీపై పడి పోయిన పాప్ క్వీన్ మడోన్నా

స్టేజీపై పడి పోయిన పాప్ క్వీన్ మడోన్నా

Posted By:
Subscribe to Filmibeat Telugu

లండన్: పాప్ క్వీన్ మడోన్నా బ్రిట్ అవార్డ్స్-2015 వేడుకలో పెర్ఫార్మెన్స్ ఇస్తూ కింద పడిపోయింది. ఆమె పడిపోగానే షో చూస్తున్న వారంతా ఏమైందో అని కంగారు పడ్డారు. అయితే వెంటనే తేరుకున్న ఆమె తన పెర్ఫార్మెన్స్ కంటిన్యూ చేసారు. ఆమె కిందపడటానికి కారణం ప్రత్యేకంగా డిజైన్ చేసిన పొడవాటి డ్రెస్సే.

 Brit Awards 2015: Madonna Falls Off Stage While Performing

‘లివింగ్ ఫర్ లవ్..' అనే సాంగుకు పెర్ఫార్మెన్స్ ఇస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. షో పూర్తయిన తర్వాత ఆమె ఈ సంఘటన గురించి తన ట్విట్టర్లో ప్రస్తావించారు. ‘డ్రెస్సు వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. కాలుకు చిక్కుకోవడంతో పడిపోయాను. అయినా నేను లెక్క చేయలేదు. నా ఆటను ఏదీ ఆపలేదు' అంటూ ట్వీట్ చేసారు.

మడోన్నా గురించి ఇతర వివరాల్లోకి వెళితే...55 ఏళ్ల ఈ ముదురు భామ ఓ కుర్రాడితో డేటింగ్ చేస్తోందట. 26 ఏళ్ల కొరియోగ్రాఫర్ టిప్ స్టెఫెన్స్‌తో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. అయినే ఇలాంటివి మడోన్నాకి కొత్తేమీ కాదు. మడోన్నా గురించిన ఇతర వివరాల్లోకి వెళితే...ఎప్పుడూ ఏదో ఒక టాపిక్‌తో వార్తల్లో నిలవడం ఆమె ప్రత్యేకత.

 Brit Awards 2015: Madonna Falls Off Stage While Performing

ఆ మధ్య ఒక సారి తనపై రేప్ జరిగిన విషయాన్ని బయట పెట్టిసెన్సేషన్ క్రియేట్ చేసింది. అమెరికన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మడోన్నా ఈ విషయాలను వెల్లడించింది. ఆర్టిస్టుగా అవకాశాల కోసం న్యూయార్కులో కష్టపడుతున్న సమయంలో నైప్‌పాయింట్ వద్ద ఆమెపై అత్యాచారం జరిగిందట. అంతే కాకుండా గన్ పాయింట్, తన అపార్టుముంట్ వద్ద మూడు సార్లు తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంది.

English summary
Brit Awards 2015 had its own set of best and embarrassing moments. The queen of Pop, Madonna is back with her new album, Rebel Heart, and while performing her fierce number, Madonna suffered an embarrassing moment.
Please Wait while comments are loading...