»   » విమర్శల పాలయిన బ్రిట్నీ స్పియర్స్ గ్రామీ అవార్డుల దర్శనం...!!

విమర్శల పాలయిన బ్రిట్నీ స్పియర్స్ గ్రామీ అవార్డుల దర్శనం...!!

Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ లో ఏదైనా అవార్డు ఫంక్షన్ జరిగితే అందరూ ఆశక్తిగా ఎదురుచూసేది, ఏ తార ఎలా తయారయి వస్తుంది, ఎలాంటి కొత్త కొత్త ఫ్యాషన్ లను మనకు పరిచయం చేస్తుంది అనే. రెడ్ కార్పెట్ మీద హొయలొలికిస్తూ వారు నడుస్తూ వస్తుంటే ఆ తారలే భువి నుండీ దివికి దిగి వచ్చినట్టు వుంటుంది. గత ఆదివారం జరిగిన గ్రామీ అవార్డుల కార్యక్రమానికి వచ్చిన పాప్ తారల వస్త్రసౌందర్యం వర్ణింపరానిది. లేడీ గాగా, టేలర్ స్విఫ్ట్, క్యాటీ పెర్రీ, రిహన్నా వంటి తారలు అందమయిన వస్త్రధారణతో మెరిసిపోయారు.

కానీ ఒకప్పుడు పాప్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన బ్రిట్నీ స్పియర్స్ తను వేసుకొచ్చిన దుస్తులతో విమర్శలపాలయింది. నల్లటి స్కిన్ ఫిట్ మీద నెట్ లాంటి గౌనుతో రెడ్ కార్పెట్ మీద దర్శనమిచ్చి ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె వస్త్రధారణనపై ఆమె అభిమానులు కూడా పెదవివిరిచారు. కాగా ఆమె ఈ కార్యక్రమానికి తన మాజీ ప్రియుడు, మ్యానేజర్ జాసన్ ట్రావిక్ తో కలసి రావడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇటీవలే విడిపోయిన వీరిద్దరూ వృత్తిపరంగా కలసి పనిచేస్తున్నారే తప్పించి తిరిగి కలసిపోలేదని సన్నిహిత వర్గాల సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu