»   » విచ్చలవిడిగా తిరుగుతూ తండ్రిని బెదరగొడుతున్న బ్రిట్నీ స్పియర్స్..!!

విచ్చలవిడిగా తిరుగుతూ తండ్రిని బెదరగొడుతున్న బ్రిట్నీ స్పియర్స్..!!

Subscribe to Filmibeat Telugu

ప్రముఖ పాప్ తార బ్రిట్నీ స్పియర్స్ డిప్రెషన్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. పబ్లిక్ గా మెల్ట్ డౌన్ అయిన బ్రిట్నీని కోర్టు ఆమె తండ్రికి అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో తనకు స్వేచ్ఛ లేకుండాపోయిందని తెగ బాధపడుతున్న బ్రిట్నీ దాన్నుండీ ఉపసమనం పొందడానికి విచ్చలవిడిగా షాపింగులకు తిరుగుతూ, డబ్బును ధారాళంగా ఖర్చుపెడుతోందట. గత ఒక్క నెలరోజుల్లోనే ఆమె 15 లక్షల డాలర్లను షాపింగ్ కు దారపోసిందటే ఆమె ఏ రేంజిలో డబ్బును షాపింగ్ కు ఉపయోగిస్తోందో అర్థం చేసుకోవచ్చు.

కానీ ఆమె ప్రవర్తనను చూసి ఆమె తండ్రి జెమీ స్పీయర్స్ భయపడుతున్నాడట, ఎక్కడ సంపాదించినది అంతా షాపింగులకు తగలేస్తుందోనని. ఇదిలా వుంచితే ప్రపంచ యాత్రను ముగించుకొని తిరిగి వచ్చిన బ్రిట్నీ తాజాగా క్యాండీస్ అనే వాణిజ్య ప్రకటన కోసం ఇచ్చిన ఫొటో షూట్ లో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోందట. ఈ ఫొటోలు చూసిన ఆభిమానులు ఎంతో ఆనందిస్తున్నారట. తమ అభిమాన పాప్ తార తిరిగి మునుపటి కలను సంతరించుకోవాలని వారు అభిలాషిస్తున్నారట.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu