»   » అమ్మా నేను చనిపోతున్నా.. తల్లితో స్టార్ నటీమణి చివరి మాటలు..!!

అమ్మా నేను చనిపోతున్నా.. తల్లితో స్టార్ నటీమణి చివరి మాటలు..!!

Subscribe to Filmibeat Telugu

క్లూ-లెస్ సినిమాతో అందరికీ చేరువైన నటీమణి బ్రిటానీ ముర్ఫి. హాలీవుడ్ లో మంచి నటిగా పేరుతెచ్చుకున్న బ్రిటానీ గత డిసెంబరు 20వ తేదీన మరణించిన సంగతి తెలిసిందే. కాగా బ్రిటానీ చనిపోవడానికి ముందు జరిగిన హృదయవిదారకమైన సంఘటనను ఆమె భర్త సిమాన్ మోన్ జాక్ ఇటీవలే వెళ్లడించాడు. అతని మాటల్లోనే "డిసెంబరు 20వ తేదీన ఉదయాన్నే నిద్రలేచిన ముర్ఫి శ్వాశతీసుకోవడానికి ఇబ్బంది పడుతోంది. దీంతో ఆమె ఆరుబయటకు వెళ్లగా ఆమె తల్లి షరాన్ కూడా ఆమె అనసరించారు. అప్పుడు బ్రిటానీ తన తల్లితో అమ్మా నేను చనిపోతున్నాను. ఐ లవ్ యూ అని చెప్పింది. ఆ తర్వాత బాత్ రూంలోకి వెళ్లింది బ్రిటానీ తన తల్లితో. దీంతో నేను బయటే వుండియాను".

ఇలా అతను చెప్పగా ప్రక్కనే వున్న బ్రిటానీ తల్లి అందుకొని ఇలా చెప్పింది. "బాత్ రూంలో కూడా బ్రిటానీ శ్వాశతీసుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతోంది. నేను తనకిష్టమయిన కుక్క పిల్ల క్లారాతో పాటు ఆమె ప్రక్కన కూర్చొని వున్నాను. ఇంతలో ఆమె అమ్మా నన్నోసారి హత్తుకో, నా శ్వాశ ఆగిపోతంది అంది. దీంతో నేను ఆమెను పట్టుకోవడానికి లేస్తుండగానే ఆమె ప్రక్కకి ఒరిగిపోయింది" అంటూ కన్నీటిపర్యంతం అవుతూ చెప్పుకొచ్చింది. ఇలా సాగిన వారి ఇంటర్యూ వీక్షకులని కన్నీరు పెట్టించింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu