twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రూ 34 లక్షలు పలికిన సూపర్ స్టార్ కోటు

    By Nageswara Rao
    |

    హాంగ్‌కాంగ్: మార్షల్ ఆర్ట్స్‌తో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ప్రముఖ చైనీస్ అమెరికన్ నటుడు బ్రూస్ లీ తన చివరి సినిమా 'గేమ్ ఆఫ్ డెత్"లో ధరించిన ఓ కోటుకు రూ. 34 లక్షల 49 వేల అత్యధిక ధర పలికింది. బ్రూస్ లీ ఉపయోగించిన వస్తువులతో శనివారం హాంగ్‌కాంగ్‌లో భారీవేలం నిర్వహించారు. ఈ వేలంలో లీ నీలిరంగు కోటుతో సహా మొత్తం 13 వస్తువులూ అంచనాలకు మించి రూ. కోటికిపైగా రికార్డు ధరకు అమ్ముడుపోయాయి. 1973లో లీ మరణానంతరం విడుదలైన 'గేమ్ ఆఫ్ డెత్"లో ఆయన ధరించిన కోటుకు వేలంలో రూ. 4 లక్షల ధర పలకవచ్చని తొలుత భావించారు.

    అయితే ఆ అంచనాలను తలకిందులు చేస్తూ దాదాపు తొమ్మిది రెట్ల అధిక ధరకు ఓ అమెరికన్ ఆ కోటును సొంతం చేసుకోవడం విశేషం. ద గ్రీన్ హార్నెట్ అనే ఓ టీవీ సిరీస్‌లో తను పోషించిన కాటో పాత్ర గురించి స్నేహితునికి వివరిస్తూ లీ 45 ఏళ్ల కిందట రాసిన ఓ ఉత్తరానికి ఈ వేలంలో రూ. 22 లక్షల ధర పలికింది.

    లీ కుంగ్‌ఫూ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సభ్యత్వ కార్డు(రూ. 11 లక్షలు)తో పాటు మరో మూడు వస్తువులను మొత్తం రూ. 15 లక్షలు చెల్లించి ఆల్బర్ట్ వాంగ్ అనే ఓ రియల్‌ఎస్టేట్ వ్యాపారి కొనుగోలు చేశారు. లీ స్నేహితుడి చిరునామాతో ఉన్న ఓ ఎన్వలప్‌నూ ఔత్సాహికులు సొంతం చేసుకున్నారు. కాగా ఔషధాలు వికటించడంతో కేవలం 32 ఏళ్ల వయసులోనే బ్రూస్ లీ అకాలమరణం పొందారు. ఆయన భార్య, కూతురు ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారు.

    English summary
    A fur-lined coat once owned by martial arts film star Bruce Lee has sold at auction in Hong Kong for almost nine times the expected price.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X