ప్రముఖ హీరోకి అరుదైన వ్యాధి.. యాక్టింగ్‌కు గుడ్‌బై.. భయంకరమైన వ్యాధి ఏమిటంటే?

హాలీవుడ్ నటుడు బ్రూస్ విల్లీస్ తన నట జీవితానికి ముగింపు చెప్పేందుకు సిద్దమయ్యారు. గత కొద్దికాలంగా అరుదైన వ్యాధితో బాధ పడుతున్నబ్రూస్ విల్లీస్ పలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు. బ్రూస్ విల్లీస్ ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన కుటుంబ సభ్యులు తన కెరీర్‌కు దూరంగా ఉంచాలని భావించారు. దాంతో ఓ సుదీర్గమై, భావోద్వేగమైన లేఖలో తాజా పరిస్థితులను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు వివరించారు. ఈ లేఖ వివరాల్లోకి, అలాగే బ్రూస్ విల్లీస్ ఆరోగ్యం, ఆయన కెరీర్, ఆయనను వెంటాడుతున్న వ్యాధి గురించిన వివరాల్లోకి వెళితే..

ఫ్యాన్స్‌ను షాక్‌లో ముంచిన సోషల్ మీడియా పోస్టు

ఫ్యాన్స్‌ను షాక్‌లో ముంచిన సోషల్ మీడియా పోస్టు

హాలీవుడ్‌లో స్టార్ హీరో బ్రూస్ విల్లీస్ తన నటనకు స్వస్తి చెప్పుతున్నారనే వార్త ప్రపంచ సినీ అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. డ్రూస్ విల్లీస్ అఫేసియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. వైద్యుల సూచనలు, సలహాల మేరకు ఆయనను కెరీర్‌కు దూరంగా ఉంచాలనే సూచించారు. దాంతో ఆయన కుటుంబ సభ్యులు ఇక ఆయన నటించలేరు అనే విషయాన్ని చెప్పి ఎమోషనల్ అయ్యారు.

బ్రూస్ విల్లీస్ గురించి ఫ్యామిలీ మెంబర్స్

బ్రూస్ విల్లీస్ గురించి ఫ్యామిలీ మెంబర్స్

బ్రూస్ విల్లీస్ రిటైర్మెంట్ గురించి కుటుంబ సభ్యులు వెల్లడిస్తూ.. బ్రూస్ విలీస్‌ను అమితంగా అభిమానించే అభిమానులకు, సన్నిహితులు, స్నేహితులకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేయాలనుకొంటున్నాం. ఆయన ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఆయన అరుదైన అఫేసియా అనే వ్యాధికి గురయ్యారని వైద్యులు చెప్పారు. అందుకే అతడు నటనకు స్వస్తి చెప్పాలని భావించారు అని సోషల్ మీడియాలో వెల్లడించారు.

అభిమానులకు ఇది కఠిన నిర్ణయమే..

అభిమానులకు ఇది కఠిన నిర్ణయమే..

బ్రూస్ విల్లీస్ తన నటనకు స్వస్తి చెప్పాలని తీసుకొన్న నిర్ణయం చాలా కఠినమైనది. అంతేకాకుండా బాధకరమైనది. అభిమానులు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేని విషయం. ఎన్నో ఏళ్లుగా భేషరతుగా ప్రేమను కురిపించారు, మద్దతు తెలిపారు, విడదీయలేని అనుబంధాన్ని పెంచుకొన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాన్ని తీసుకొన్నాం. మనమంత ఒక్కటిగానే ఉండి బ్రూస్ విల్లీస్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దాం. బ్రూస్ ఎప్పుడూ పరిపూర్ణమైన జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకొంటారు. ఆయన విజన్‌ను మనం కొనసాగిద్దాం అని కుటుంబ సభ్యులు ఎమ్మా, డెమీ, రుమర్, స్కౌట్, తల్లులా, మాబెల్, ఎవెలీన్ అన్నారు.

అఫేసియా అనే వ్యాధి అంటే ఏమిటి?

అఫేసియా అనే వ్యాధి అంటే ఏమిటి?

అఫేసియా అనే వ్యాధి ఏమిటంటే.. భాషా పరమైన ఇబ్బందులను సదరు రోగి ఎదుర్కొంటాడు. బ్రెయిన్‌లోని ఒక ప్రదేశానికి గాయం కావడం లేదా ఏదైనా సమస్య రావడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. వారు భాషను ఉచ్చరించడానికి లేదా అవగాహన చేసుకొనే పరిస్థితి ఉండదు. ఎదుటి మనిషితో సరైన రీతిలో మాట్లాడటానికి అవకాశం ఉండదు. చాలా మందికి బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఇలాంటి సమస్య మెదడులో ఏర్పడుతుంది. భాషపరమైన లోపాలు సంభవిస్తాయి. ఇతరులకు తనలోని భావాలను చెప్పడానికి సమస్యలు ఏర్పడుతాయి అనేది వైద్యులు వివరణ.

Recommended Video

RRR లో మల్లి..ఎవరీ చిట్టితల్లి? Twinkle Sharma లైఫ్ మలుపు తిప్పిన యాడ్ | Filmibeat Telugu
బ్రూస్ విల్లీస్ కెరీర్ ఇలా..

బ్రూస్ విల్లీస్ కెరీర్ ఇలా..

బ్రూస్ విల్లీస్ కెరీర్ విషయానికి వస్తే.. 1970లో ఆఫ్ బ్రాడ్‌వే అనే వేదికపై యాక్టింగ్ కెరీర్ ప్రారంభమైంది. 1985లో మూన్‌లైటింగ్ అనే కామెడీ డ్రామా సిరీస్ ద్వారా అత్యంత గుర్తింపు లభించింది. డై హార్డ్ అనే చిత్రంతో హాలీవుడ్‌లో బ్రూస్ విల్లీస్ పాగా వేశాడు. అప్పటి నుంచి ఆయనకు ఎదురే లేకుండాపోయింది. ది లాస్ట్ బాయ్ స్కౌట్, పల్ప్ ఫిక్షన్, 12 మంకీస్, లాస్ట్ మ్యాన్ స్టాండింగ్, ఫిఫ్త్ ఎలిమెంట్, అర్మగేడ్డాన్, ది సిక్త్స్ సెన్స్, హార్ట్స్ వార్, టియర్ ఆఫ్ ది సన్, 2019లో చివరగా మదర్‌లెస్ బ్రూక్లీన్ అనే చిత్రంలో నటించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X